మీకు థ్రిల్లర్లంటే ఇష్టమైతేహాయిగా కొని చదివెయ్యండి

ఫిబ్రవరి 21, రాత్రి 8.05 నిమిషాలు, ప్రదేశం తాడేపల్లిగూడెం మినీ బైపాస్ మీద ఆగిన ఎక్స్‌ప్రెస్ బస్సులో మొదటి సీటు. ఐదు నిమిషాలు టిక్కెట్టు కొని చిల్లర పుచ్చుకోవడానికి, మూడు నిమిషాలు సామాన్లు సర్దుకోవడానికి, ఏడు నిమిషాలు చట్నీ నంచుకుంటూ మూడున్నర ఇడ్లీలు (సగం కింద పడిపోవడం వల్ల) తినడానికి ఖర్చయిపోయాయి, వాట్సాప్‌ మేసేజ్‌లకు జవాబులివ్వడానికి, ఫోన్లు చేయడానికి మరో ఐదు నిమిషాలు. దానితో సమయం 8.25 నిమిషాలు కావచ్చింది. అప్పుడు, బ్యాగులోంచి సూదంటురాయిలా లాగే రంగులు, […]

మీకు థ్రిల్లర్లంటే ఇష్టమైతేహాయిగా కొని చదివెయ్యండి Read More »

మానసిక సంఘర్షణను అద్బుతంగా చిత్రీకరించారు.

“The best thing about being a girl is, now I don’t have to pretend to be a boy.” సన్ ఆఫ్ జోజప్ప నవలలోని పిల్లోడి నిర్ధారణ. Judith Light ఇలా అంటారు” You know gay, lesbian, bisexual, transgender- people are people” నేను ఒక సాధారణ పాఠకుడను. నాకు సమీక్షలు, పుస్తక పరిచయాలు వ్రాయడం రాదు. ఈ నవలను చదివి కేవలం ఒక పాఠకుడి స్పందనగా దీనిని

మానసిక సంఘర్షణను అద్బుతంగా చిత్రీకరించారు. Read More »

ఆ అడవిదారుల, గిరిజన జీవులమధ్యా తిరుగుతున్నట్టు మనసు నిండిపోయింది

యాత్రికుడు అనే మాట వినగానే చిన్నప్పుడు చదివిన యూఅన్‌ఛాంగ్ లాంటి రూపం ఒకటి కదిలేది. ఆ తర్వాత అది రకరకాల మార్పులు చెందుతూఒకసారి పరవస్తు లోకేశ్వర్ లాగా, మరోసారి దాసరి అమరేంద్రలాగా లేదంటే మరొకలాగా … ఎన్నో రూపాలు మారుతూ ఓ నాలుగేళ్లకిందట మాచవరపు ఆదినారాయణ గారి రూపం తీసుకుంది. ఇప్పటికీ యాత్రికుడు అనగానే ఆదినారాయణ గారి రూపమూ, “తిరిగే తుమ్మెదకే తేనె దొరుకుతుందీ అనే వాక్యమూ గుర్తొస్తాయి.” (ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ ఒక్కోసారి గుర్తొచ్చినా

ఆ అడవిదారుల, గిరిజన జీవులమధ్యా తిరుగుతున్నట్టు మనసు నిండిపోయింది Read More »

ఊహకందని విచిత్రమైన మలుపు తేజో – తుంగభద్ర

మిత్రమా వసుధేంద్రా! Vasudhendra నిద్రపోతూ ఉండి ఉంటావు కదా ఈ సమయానికి. ఎట్లా? ఈ దిగులు కుండను నా నెత్తి మీద మోపి నువ్వీ రాత్రివేళ నిద్రపోగలుగుతున్నావు. బెల్లా చేతినుంచి గాబ్రియేల్ దగ్గరికి అక్కడినుంచి అగ్వేద దగ్గరికీ ఆమె చేతిమీదుగా తుంగబద్రా నదిలోకి జారిన బంగారు చేపపిల్లనై అటు లిస్బన్ కీ ఇటు హంపీకి మధ్య… గోవాలో తెగిపడిన గాబ్రియేల్ శిశ్నపు పూర్వచర్మపు ముక్కనై రోదిస్తున్నాను నాయనా. ఎక్కడ మొదలైందో ఈ కథ…. కథలా అనిపించే వికృత

ఊహకందని విచిత్రమైన మలుపు తేజో – తుంగభద్ర Read More »

తన దృక్పథం నుంచి తన జీవితం

[శ్రీ చందకచర్ల రమేశ బాబు అనువదించిన ‘నేను.. కస్తూర్‌బా ని’ అనే పుస్తకాన్ని సమీక్షిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.] సాధారణంగా, తమ తమ రంగాలలో విజయం సాధించిన పురుషుల విషయంలో – వారికి వెన్నుదన్నుగా నిలిచిన స్త్రీల గురించి బయటి ప్రపంచానికి తెలిసేది చాలా తక్కువ. ఒకవేళ తెలిసినా అది సంక్షిప్తంగానే ఉంటుంది తప్ప సమగ్రంగా ఉండదు. అసలు ఎవరైనా ఏదైనా సాధించాలంటే, వారి కృషితో పాటుగా, వెనుక ఉండి మద్దతిచ్చే వారి తోడ్పాటూ కీలకం. బహుశా

తన దృక్పథం నుంచి తన జీవితం Read More »

చదువుతుండగా రెండుమూడు సార్లు కన్నీరొలికింది

సన్ ఆఫ్ జోజప్ప: నవలిక: సోలోమోన్ విజయ కుమార్ : ఛాయ ప్రచురణ: సెప్టెంబరు 6, 2018న దేశ అత్యున్నత న్యాయస్థానం తన తీర్పులో భారతీయ శిక్షా స్మృతిలో సెక్షన్ 377 రాజ్యాంగ విరుద్ధమన్నది, న్యాయ చరిత్రలో ఒక మైలురాయి. సమలైంగితను ఇష్టపడే వారు స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్న రోజు. ఏ నేరం చేయకపోయినా సమలైంగికతను కోరుకునే వారు సమాజంలో ఇక నేరస్థులు కారని చెప్పిన రోజు. సమలైంగిక సంబంధాల వలన పునరుత్పత్తి జరుగదు కనుక అది

చదువుతుండగా రెండుమూడు సార్లు కన్నీరొలికింది Read More »

పదాల మధ్య పెద్ద ఊహనిండుకొని ఉంటుంది.

కథలు, నవలలు రాసినంత మాత్రాన్నే ఒకరిని సృజనాత్మక రచయిత అనలేను. ఆ రచయిత రాతలోని పదాల మధ్య ఉన్న ఊహ ద్వారా మాత్రమే వారిని సృజనాత్మక రచయిత అనగలను. కేవలం పదాలు పదాలుగానే మిగిలిపోతే అంతకన్నా పేలవమైన రచన మరొకటి ఉండదని నేను తలుస్తాను. పతంజలి గారి కథలు చదివినప్పుడు ఆయన రాతలోని పదాల మధ్య పెద్ద ఊహ నిండుకొని ఉంటుంది. ఆయన రాసిన ఒక కథ చదివి పుస్తకం మూసేసి, ఇంకో కథను రాయగలిగినంత ఊహను

పదాల మధ్య పెద్ద ఊహనిండుకొని ఉంటుంది. Read More »

Coming soon

శీను రామసామి ప్రఖ్యాత సినీ దర్శకుడు, కవి.తన సినిమాలకు గాను జాతీయ అవార్డు అందుకున్నాడు. కవిగానూ తమిళ సాహిత్యంలో Contemporary Realistic visual Poetగా పేరు గాంచాడు.తన మొదటి కవితా పుస్తకం Oru veetaipattriya uraiyadal (A conversation about one House)రెండవ కవితా పుస్తకం aatral nadanthen (Because of the wind I walked)మూడవది Pukaar pettiyin meethu paduthurangum poonai (Cat sleeping on a complaint box)తన మూడవ పుస్తకం ‘ఫిర్యాదు

Coming soon Read More »

ప్రతి కథా ఒక ప్రశ్న…ఒక డిస్కషన్…. ఒక మెలకువ.

పతంజలి శాస్త్రి గారు ఒక లిటరరీ అడ్డిక్షన్. పోలిక సరికాదేమో గానీ, రేపు రిలీజయ్యే సినిమా కోసం ఇవ్వాళ సెకండ్ షో అయిపోయాక, టికెట్ల క్యూ లో నిద్రోయే లాంటి అడిక్షన్. కొత్త కథల పుస్తకం వస్తుందనగానే ఆత్రుత అందునా ఇంతవరకూ ఎక్కడా ప్రచురితం కాని కథలు…దాంతో మరింత హైప్. ఉత్సుకత. శాస్త్రి గారు ఎప్పటిలానే పాఠకుణ్ణి ఎలాంటి నిరాశకీ గురి చేయలేదు. గురి తప్పనూ లేదు. కాస్త స్ట్రాంగ్ గా కూడా ఉంది.ప్రతి కథా ఒక

ప్రతి కథా ఒక ప్రశ్న…ఒక డిస్కషన్…. ఒక మెలకువ. Read More »

“రచయిత ఎంత దాక్కోవాలని చూసినా పదాల మధ్య తన గొంతు ఆ రచయితను పట్టిస్తుంది”.

ఒక వ్యక్తి జీవితంలో జరిగిన సంఘటన ఆధారంగా, జీవితం ఆధారంగా ఒక నవల రాయవచ్చు. వాటిని చారిత్రిక నవలలు లేదా జీవిత చరిత్ర నవలలు అనవచ్చు. గురజాడ జీవితంలోని ఒక ముఖ్య సంఘటన ఆధారంగా ఆయన సాహిత్యాన్ని, జీవితాన్ని చెప్పబడిన నవలగా ఈ పుస్తకాన్ని ఎంచవచ్చు. ఈ రచన చారిత్రిక, పరిశోధనాత్మక నవల కన్నా ఒక తరం నుంచి మరో తరం చెప్పుకుంటూ వచ్చిన కథ ఆధారంగా అల్లబడినది నవల. ఈ పుస్తకం మొదట ప్రారంభించినప్పుడు ఒక

“రచయిత ఎంత దాక్కోవాలని చూసినా పదాల మధ్య తన గొంతు ఆ రచయితను పట్టిస్తుంది”. Read More »

Shopping Cart
Scroll to Top