మానసిక సంఘర్షణను అద్బుతంగా చిత్రీకరించారు.

“The best thing about being a girl is, now I don’t have to pretend to be a boy.” సన్ ఆఫ్ జోజప్ప నవలలోని పిల్లోడి నిర్ధారణ.

Judith Light ఇలా అంటారు” You know gay, lesbian, bisexual, transgender- people are people”

నేను ఒక సాధారణ పాఠకుడను. నాకు సమీక్షలు, పుస్తక పరిచయాలు వ్రాయడం రాదు. ఈ నవలను చదివి కేవలం ఒక పాఠకుడి స్పందనగా దీనిని వ్రాస్తున్నాను.

ఛాయా హైదరాబాద్ వారు సోలోమోన్ విజయ్ కుమార్ వ్రాసిన నవల “సన్ ఆఫ్ జోజప్ప” ను ఇటీవల ప్రచురించింది. ఈ ప్రచురణ ఒక సాహసమనే చెప్పాలి.

నవలలో ప్రధానమైన పాత్రలు పిల్లోడు(సన్ ఆఫ్ జోజప్ప), అవ్వ, లింగ, అమ్మ , సుధా, బాబు.

నవలలోని పరిమళాలు వెదజల్లే భాష, పాత్రల స్వభావం, narration మనలను ఆపకుండా చదివిస్తాయి.

నవల “ఆ సిన్న పిల్లోడిది అయోమయిపు పెపంచం” అనే వాక్యంతో ప్రారంభమై “పిల్లోడు అడుగు ముందుకు వేసినాడు” తో ముగుస్తుంది. పిల్లోడు తన అయోమయిపు పెపంచం వదలి ఈ నిర్ణయానికి రావడానికి దోహదం చేసిన పరిస్థితులే కథ సారాంశం.

ఇది ఒక Third Gender కథ. నేనైతే ఒక అమ్మాయి కథ అంటాను. ఎందుకంటే వారు స్త్రీ గా గుర్తింప బడాలని కోరుకొంటారు కాబట్టి. ముగింపు పిల్లోడు అడుగు ముందుకు వేసినాడు అని కాకుండా అమ్మాయి అడుగు ముందుకు వేసింది అని ఉండిఉంటే సన్ ఆఫ్ జోజప్ప కు రచయిత మరింత సపోర్ట్ చేసినట్లు ఉండేది.

విజయ కుమార్ గారు సహానుభుతితో పిల్లోడి సంఘర్షణను చిత్రించడంలో వంద శాతం success అయ్యారని చెప్పవచ్చు. సర్వసాక్షి కోణంలో కథ నడిచినా సన్ ఆఫ్ జోజప్ప మానసిక సంఘర్షణను అద్బుతంగా చిత్రీకరించారు. నేను ఇప్పటివరకు చదివిన third genderకు సంబందించిన తెలుగు సాహిత్యంలో ఎక్కువ భాగం sexualityకు ప్రాధాన్యత ఇచ్చి వ్రాసారు. కాని ఈ నవలలో అత్యంత సహజంగా సన్ ఆఫ్ జోజప్ప జీవితాన్నీ విజయ్ కుమారు గారు సమగ్రంగా చిత్రించారు. Sexuality is the part of life of Son of Jojappa అని చెప్పారు.

నవలలోని ప్రతి పాత్ర అది ఉన్న పరిస్థితులలో ఎలా ప్రవర్తించాలో అలానే ప్రవర్తించాయి. అంటే పాత్రల చిత్రీకరణ అత్యంత సహజంగా నిర్వహించడంలో రచయిత success అయ్యాడని చెప్పవచ్చు. “నన్ను అర్తం జేస్కొని పెవిచ్చే మొగోడు దొరక్కపోయినా అవ్వలాంటి , లింగ లాంటి మాతల్లులైనా యాడ్నో ఉంటారు” అని తల్లికి వ్రాసిన ఉత్తరం లో చెబుతాడు. ఈ పుస్తకం చదివిన తరువాత third gender పై ఖచ్చితంగా మన అభిప్రాయాలు మారతాయి. మన అభిప్రాయాలు మార్చడంలో రచయిత విజయం సాధించాడని నేను కచ్చితంగా చెప్పగలను. Thank you Soloman Vija Kumar sir and thank you Chaaya for creation of this literature.

“I’ve never been interested in being invisible and erased.”

-Laverne Cox, actress and LGBTQ advocate

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Shopping Cart
Scroll to Top