వాస్కోడగామా భారతదేశానికి సముద్ర మార్గం కనుగొన్న తర్వాత పోర్చుగీసు ప్రజలు, లిస్బన్ నగరవాసులు మనదేశం నుంచి సుగంధద్రవ్యాలు తీసుకొని వెళ్ళి యూరోప్ లో అమ్మి బాగా డబ్బు గడించే వారు. “తేజో తుంగ” నవల కథ పోర్చుగీసు రాజధాని లిస్బన్ లో, మనదేశంలోని విజయనగర సామ్రాజ్యంలోని తెంబకపురంలో జరుగుతుంది. రెండు ప్రేమకథలు సమాంతరంగా సాగుతాయి. లిస్బన్లో గాబ్రియల్ అనే Christian యువకుడు ఇసబెల్లా అనే యూదు యువతిని ప్రేమిస్తాడు. ఆమె ధనవంతుని బిడ్డ, ఆతను పేద యువకుడు. […]

Read More »

హంపీ నడిపిన ప్రేమకథ

ఏ యుద్ధమైనా ప్రజలకు మాత్రమే నష్టం చేస్తుంది. అధికార కాంక్ష పెరిగిన తర్వాత రాజ్యాల కన్ను సుభిక్షంగా ఉండే ప్రాంతాల మీద పడింది. అక్కడినుంచే కుటిల తంత్రాలు మొదలయ్యాయి. దేశం ఎలా ఉన్నా , ఎన్ని కరువులు సంభవించినా కానీ రాజ్యాలు తమ సైన్యాన్ని పెంచి పోషించే నిల్వలు మాత్రం గట్టిగానే పొగుచేసుకున్నాయి.ప్రపంచ చరిత్ర నిండా ఎన్నో మరకలున్నాయి, వెన్నుపోట్లు, వక్రీకరణలు ఇలా రాసుకుంటూ పోతే అంతం లేకుండా సాగుతూనే ఉంటుంది. కూలిన కోట గోడల వెనక

హంపీ నడిపిన ప్రేమకథ Read More »

కాలానికి అవసరమైన కథలు

కొన్ని చీకట్లూ… ఓ వెలుతురూ… పేరు తగినట్లే వెలుగూ చీకట్ల కథలివి. చీకటిని చీల్చి ప్రభాతం వెలుగొందుతుందని చెప్పిన కథలివి. ప్రగతి మహిళగానూ, ఉపాధ్యాయురాలిగానూ తన చుట్టూ చూసిన మనుషుల్ని కథలు చేసింది. పిల్లలు బడికి రావడం లేదని ఒక్కోసారి తీసుకునే అడ్మినిస్ట్రేటివ్ నిర్ణయం వలన ‘తిరుపాలమ్మ’ లాంటి విద్యార్థుల జీవితాలు ఏ మలుపు తీసుకుంటాయో! ఆ నిర్ణయం తీసుకునే పొజిషన్లో ఉండేవారే చెప్పగలరు. “రైటింగ్ కౌచ్” రచనారంగంలో ఉన్నవారూ, కొత్తగా రాస్తున్నవారు తప్పక చదవాల్సిన కథ.

కాలానికి అవసరమైన కథలు Read More »

చారిత్రిక నవలలు రాయటం అంత సులువుకాదు

యుద్దమంటే మానవత్వంపై దాడి, హక్కుల హననం. అటువంటి ఒక బీభత్స, విషాద నేపథ్యంలో మనుషుల మధ్య, ముఖ్యంగా యువతీ యువకుల మధ్య ప్రేమలు తొడగడం ఆశ్చర్యం గొలుపుతుంది. ఒక కొత్త ఆశనూ చిగురింపజేస్తుంది. కులాలకు, జాతులకు, దేశాలకు అతీతంగా పాదుకునే ఈ ప్రేమలు మనుషుల హృదయ సత్ శీలతకు నిదర్శనం. యుద్ధంలో కూరుకుపోయి రాజ్యం కూలిపోతున్నప్పుడు, విలువలు పతనమై దేశం కునారిల్లుతున్నప్పుడు, మనుగడే ప్రశ్నార్ధకమైనప్పుడు యువతీయువకులే దాని ప్రక్షాళనకు నడుంబిగిస్తారు. న్యాయం పక్షాన నిలబడతారు. బయటికి కనిపించకుండా

చారిత్రిక నవలలు రాయటం అంత సులువుకాదు Read More »

ఉస్మానియా వెలుగులో పుస్తకావిష్కరణ సభ

నలమాస కృష్ణ రచించిన “ఉస్మానియా వెలుగులో తెలంగాణ విద్యార్థి ఉద్యమం” పుస్తకావిష్కరణ సభ ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ News Coverage

ఉస్మానియా వెలుగులో పుస్తకావిష్కరణ సభ Read More »

పతంజ‌లిశాస్త్రి క‌థ‌లు.. వేరే లోకం

పతంజలి శాస్త్రి కథలంటే ఇష్టం. ఎందుకంటే తెలియదు, అది అంతే. ఆయనకి అవార్డు వచ్చినప్పుడు రాద్దామనుకున్నా. రాయలేదు. అవార్డు ఆయనకి మించింది కాదు. జ్ఞానపీఠమైనా తక్కువే. మన కాలం మహారచయిత. ఈ మధ్య నేను తెల్లారి లేస్తున్నా. బూడిద రాలుతున్న ఆకాశంలో నుంచి బంగారుపల్లెంలా సూర్యున్ని చూస్తున్నా. ఏళ్ల తరబడి జర్నలిస్టు నైట్ డ్యూటీల్లో కోల్పోయిన సౌందర్యం. నిద్రలేని రాత్రుల నుంచి, నిద్రపట్టని రాత్రుళ్ల ఫేజ్లోకి ప్రవేశించా. అందుకే అకాల మెలకువ.రాయడంలో పతంజలిశాస్త్రి ఎలా పిసినారో, ఆయన

పతంజ‌లిశాస్త్రి క‌థ‌లు.. వేరే లోకం Read More »

మరో కోణం పరిచయం చేసే నవల

2018 లో అనుకుంటా. ఆఫీస్ అయిపొయ్యేసరికి రాత్రి 9.30 దాటింది. పార్కింగ్ లోనుంచి బయటికి రాగానే వర్షం తగ్గిన తర్వాతొచ్చే చల్లగాలి వణికించింది. మళ్లీ వర్షం వచ్చేలోపు క్రిష్ణానగర్ చేరుకోవాలని శిల్పారామం మీదుగా 100 ఫీట్ రోడ్డెక్కింది నా అపాచీ బైక్. ట్రాఫిక్ తక్కువుండటంతో బైకు వేగం పెరిగేకొద్దీ వెంట్రుకలు నిక్కబొడుచుకుంటున్నాయి. మాధాపూర్ వైయస్సార్ విగ్రహం దగ్గర లిఫ్ట్ కావాలంటూ ఎవరో చెయ్యెత్తారు. చూస్తూనే చెప్పొచ్చు ఎవరో లేబర్ పని చేసుకునే అతను అని. ఆ రూట్

మరో కోణం పరిచయం చేసే నవల Read More »

50-60 వయస్సు గల వారందరూ తప్పక చదవాల్సిన పుస్తకం

ఈ మధ్య కాలంలో నేను చదివిన మంచి పుస్తకాల్లో ఇది ఒకటి. అత్యద్భతమైన కథ అని చెప్పను కాని , మనం వినని కథల్లో ఇదొకటి. సమస్యలు ఎప్పుడు ఎలా వస్తాయో, అసలు ఇటువంటి సమస్యలు కూడా ఉంటాయా అనే విధంగా చిన్నదైన చక్కటి అంశాలతో మొత్తం నవల సాగుతుంది. కథ గురించి ఇంకా ఎక్కువ చెప్బితే అందులో అందం పోతుంది. సాధారణమైన కథే అయినా కొన్ని చోట్ల ఆధ్యాత్మికంగా , కొన్ని చోట్ల ఆలోచించే విధంగా ,

50-60 వయస్సు గల వారందరూ తప్పక చదవాల్సిన పుస్తకం Read More »

మట్టి వాసనల పుస్తకం

చక్కగా ప్రతి పేజీలో మట్టి వాసన వచ్చేలా పుస్తకం రాసుకుంటే ముందు మాట రాసిన వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మార్మికత అంట గట్టేసి ఒక్కొక్క డొంక దారిలోకి తీసుకెళ్ళి వదిలేశారు. #లంకమల దారుల్లో మట్టి వాసనకి (మార్మిక భాషలో ఎదురవుతున్న) అధి భౌతికతకు మధ్యన ఉన్నది రెండు ధ్రువాల మధ్యన ఉన్న అంతరం అని ఎవరన్నారో తెలియదు. HD Thoreau అన్నవాడు Ralph Waldo Emerson, Walt Whitman అమెరికన్ transcendentalist వరసలో వచ్చిన మనిషి. ఆయన

మట్టి వాసనల పుస్తకం Read More »

Shopping Cart
Scroll to Top