Chaaya Books

‘నెమ్మి నీలం’ పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న వివేక్ శానభాగ

వేదికపై వసుధేంద్ర, మృణాళిని, పుస్తక రచయిత జయమోహన్, అనువాదకుడు అవినేని భాస్కర్, ఛాయ ఎడిటర్ అరుణాంక్ లత

బుక్ బ్రహ్మ సాహిత్య ఉత్సవ్ తెలుగు సాహిత్య సౌరభం వెల్లివిరిసింది. మూడురోజులపాటు సాగిన ఉత్సవంలో వందలాదిమంది తెలుగు రచయితలు, సాహితీ అభిలాషులు పాల్గొన్నారు. ఐదు వేదికల ద్వారా 50కి పైగా చర్చాగోష్టులు, పుస్తకావిష్కరణలు నిర్వహించారు. పలు సమీక్షల్లో ‘ఆంధ్రజ్యోతి’ ఎడిటర్ కె.శ్రీని వాస్ భాగస్వాములయ్యారు. తెలుగుతోపాటు కన్నడ, తమిళం, మళయాళ భాషల ప్రముఖ రచయితలు పాల్గొన్నారు. చివరిరోజు ఆదివారం వేలాది మంది సందర్శకులతో బెంగళూరు సెయింట్ జాన్స్ ఆడిటోరియం కిటకిట లాడింది.
‘నెమ్మి నీలం’ పుస్తకావి ష్కరణతోపాటు ‘తెలుగు కథా ప్రపంచం’ అనే అంశంపై చర్చా గోష్టి నిర్వహించారు. నాగర్ కోయిల్ కు చెందిన తమిళం, మళ యాళ భాషల ప్రముఖ రచయిత జయమోహన్ కు బుక్ బ్రహ్మ సాహిత్య పురస్కారాన్ని ప్రదానం చేశారు. రబ్బర్, కాడు, విష్ణు పురం, ఈజంపులగంతోపాటు ఎన్నో కృతులు ఆయన రచించారు. 2005లో ప్రసిద్ధమైన ఆధునిక మహాకావ్యం కొట్రవై ద్వారా గుర్తింపు పొందారు. జయమోహన్కు బుక్ బ్రహ్మ ఉత్సవ్ సాహిత్య పురస్కారం, జీవన సాఫల్య పురస్కారంతోపాటు రూ.2లక్షల నగదు అందజేశారు.

Search

Latest Updates

SUBSCRIBE

Chaaya - Subscription
Shopping cart close