Chaaya Books

“వంద కుర్చీలు” కథ నన్ను పట్టుకొని వదలడం లేదు

కరడుగట్టిన నిచ్చెనల కులవ్యవస్థ అతి నికృష్టమైన రూపాన్ని మనం దేవతల భూమి అయిన కేరళలోనే చూడగలమేమో! నాయాడి కులం “చూడరాని” కులం. నాయాడిని ఎవరైనా చూస్తేనే మైల పడతారు. అంతేకాదు.. చూడకపోయినా, సవర్ణుడికి దగ్గరలో 300 అడుగుల లోపల నాయాడి వున్నా మైల పడతారు. ఈ దూరం కులాన్ని బట్టి మారుతుంది. 300 అడుగుల కంటే లోపల నాయాడి వుంటే నంబూద్రి బ్రాహ్మణుడు మైల పడితే, 70 అడుగుల లోపలుంటే శూధ్రుడు మైల పడతాడు. ఈ చూడరాని, […]

ఆగి ఆగి చదువుతూ, కారుతున్న కన్నీళ్ళని ఆపుకుంటూ

నెమ్మి నీలం పూర్తిచేసాను. 430 పేజీలు చదవడానికి దాదాపు నెలరోజులు పట్టింది. గబగబా చదివేసి పక్కన పెట్టడానికి ఇదేం పల్ప్ ఫిక్షన్ కాదుగా! ఆగి ఆగి చదువుతూ, కారుతున్న కన్నీళ్ళని ఆపుకుంటూ, గడ్డకట్టిన దుఃఖంతో గొంతు నొప్పెడుతుంటే నేనెందుకు చదవాలీ పుస్తకాన్ని? చదివాను పో.. ఇంత బలహీనమైన గుండె నాకెందుకివ్వాలి? ఈ నెలరోజుల్లో ఈ పుస్తకాన్ని పక్కన పెట్టుకుని ఎన్ని రాత్రులు ఏడ్చి వుంటాను! మరోసారి “అమ్మవారి పాదం” కథ ఆడియో ఫైల్ వింటూ ” నాకు […]

అన్ని కథలూ దేనికవే ప్రత్యేకం. తప్పకుండా చదవాల్సిన పుస్తకం

ఫేస్బుక్ లో కొన్ని పోస్టులను చూసి, చాలా రోజులకు ఒక పుస్తకాన్ని చదవాలనే బలమైన కాంక్ష కలిగింది. అలా “నెమ్మి నీలం” చేతికి అందగానే 450 పేజీలను ఆపకుండా చదివేసాను. రచయిత స్వగతంతోనే ఉద్వేగం మొదలయింది. అవినీతి పైన ఉద్యమం ద్వారా మార్పు వస్తుంది అనే ఆయన కల నెరవేరక పోతే ఆయనలో ఒక స్తబ్ధత ఏర్పడింది. ఆ స్తబ్ధత తొలగించుకోవటానికి చేసిన అన్వేషణలో, నేడున్న పరిస్థితుల్లో ఆచరణాత్మక ఆదర్శ వాదానికి గాంధీయ సిద్ధాంతం తప్ప మార్గాంతరం […]

ప్రతి కథా చదువరుల్ని వెంటాడుతుంది

బ్రహ్మ పుస్తక సాహిత్య ఉత్సవంలో ప్రధాన ఆకర్షక (ఆకర్షణ కాదు ఆకర్షక సరైందని నా విద్యార్థి దశలో రాళ్ళపల్లి అనంత కృష్ణశర్మ గారు ఒక సభలో అనగా విన్నాను) వ్యక్తి. అంత వరకు అతని పేరు కూడా వినలేదు. రచనా తెలియదు. ఆ మూడు రోజులు నాలుగు రాష్ట్రాల రచయితలు, కళాకారులతో అద్భుతంగా సాగిన కాలం ఈ జయమోహన్ పేరుతో ఆగింది. ఛాయా పబ్లికేషన్స్ వారు నెమ్మి నీలం పేరుతో వేసిన పుస్తక ఆవిష్కరణ కిక్కిరిసిన శ్రోతల […]

ఇలా కూడా రాయొచ్చా?

ఇలా కూడా రాయొచ్చా ? అయితే నేను కూడా రాయొచ్చు ! అనిపించిందట కాఫ్కా రాసిన మెటామార్ఫసిస్ చదివాక మార్క్వేజ్ కి. అప్పటికి మార్క్వేజ్ రచయిత కాలేదు. దీన్నిబట్టి రచయిత కాదు అతని వర్క్ మాట్లాడాలి, పిచ్చెత్తించాలి, ఈడ్చుకుపోవాలి, అప్పటివరకు ఎరుగని లోవెలితిని చూపించి అశాంతితో మండించి బూడిద చెయ్యాలి. ఆ బూడిదలోంచి కొత్తజన్మ ఎత్తించాలి. ఇదంతా కళాకారుడు కాదు, అతని కళ చేయాలి. నిజానికి తాను జీవితంలో అనుభవించిన ఘోరమైన దశల్నే మండే అక్షరాలుగా మలచినవాడు […]

అనుభూతి, అనుభవం, ఆలోచన- నెమ్మినీలం

కొన్నిసార్లు కథ రాయటంకన్నా, చదవటమే భారంగా ఉంటుంది. అవును… కొన్ని కథలు జీవీతాల్లాగా ఉంటాయి. మరిచిపోయిన, కావాలనే మర్చిపోవాలనుకుంటున్న విషయాలని మళ్లీ గుర్తు చేస్తాయి. “నాగర్‌కోయిల్‌లో ఒక మంచి హత్య జరిగి చాలారోజులైంది” అని “తలఒగ్గనివాడు”తో టీకొట్టుదగ్గర మనిషి అన్నంత మామూలుగానే ఉంటుంది జీవితం కూడా. డబ్బున్నవాడికీ, లేనివాడికీ ఒకే కులంలో ఉన్నా అంతరం ఉంటుందనీ, ఇక కులం లేనివాడికి డబ్బున్నా పెద్ద తేడా ఉండదనీ తెలుస్తుంది. ఈ భారతీయ సమాజంలో పితృస్వామ్య భావజాలం మలమూత్రాలతో సంగీతాన్ని, […]

ఎందుకో బాగా ఇబ్బందికి, అసహనానికి గురి చేసింది నన్ను

నెమ్మినీలం కథల పుస్తకంలోని అమ్మవారి పాదం కథ. ఎందుకో బాగా ఇబ్బందికి, అసహనానికి గురి చేసింది నన్ను. ఆ తల్లి తరతరాల మౌనానికి, బరింపుకి ఆ పాదం నిదర్శనం. భూదేవంత ఓర్పు స్త్రీకి అనే సొల్లు మాటలు వెనకాల ఎంత వివక్ష ఉంది. గాలిలో నిలిపిన రెండో పాదాన్ని ఆమె దించితే? ఏమై ఉండేది.!? అలా నిలపటం ఆమె. అమ్మవారి పాదం ఒక మౌన వివక్ష. ఆరేళ్లకే అద్భుతమైన సంగీతాన్ని ఆలపించిన బామ్మ కావేరి నది లాంటిది. […]

వంద కమ్చీ దెబ్బల బాధ

‘నెమ్మి నీలం’ పుస్తకం లోని కధలు చదువుతున్నాను.ఏనుగు డాక్టర్ నాకు ఇష్టమైన కధ అనుకున్నాను.కానీ “వంద కుర్చీలు” కధ చదివాక ఆ అభిప్రాయం మారిపోయింది.వంద కుర్చీలు ఏమి కధ అది,జయమోహన్ ఆ కధని ఎలా రాయగలిగారు.నాయాడు కమ్యూనిటీ గురించి ఆయన ఎంత రిసెర్చ్ చేసి ఉండాలి.కధ చదువుతుంటే కడుపులో పేగులు లుంగచుట్టుకుపోతున్న బాధ,దుఖం.పేరు లేని ఆ తల్లి జీవితం,ఆ భయానకమైన జీవిత విధానం గుండెను పిండేస్తూంది.నాయాడు కమ్యూనిటి ప్రజలు ఎంత సామాజిక అణిచివేతకు గురై ఉంటే,ఎంత దుఖాన్ని […]

ప్రత్యేకం ప్రతీ కథలో అపురూపమైన కధనం ఉంది

432 పేజీలున్న ఈ కథల పుస్తకంలో :12 కథలు ఉన్నాయి ., ఛాయా రిసోర్స్ సెంటర్ – హైదరాబాద్ వారి ప్రచురణ ఈ – నెమ్మి నీలం కథల పుస్తకం ., ఇందులో ఉన్న కథలు అన్నీ కేవలం సరదా కోసమో / కాలక్షేపం కోసమో – చదవడానికి ఉపయోగపడవు ., ప్రతీ కథలోనూ – అంతర్లీనంగా ఒక విభిన్నమైన ఆలోచన ,జీవితాన్ని దర్శించగలిగిన తత్త్వం .,భావోద్వేగాలను స్థిమితంగా చూడగలిగిన మేధస్సు ., గాంధీజీ జీవన విధానాలను […]

చదివి నాలుగు రోజులు అవుతుంది. అయినా కథల్లో దృశ్యాలు కళ్ళముందు నుంచి పోవడం లేదు.

మొదటి కథ ధర్మం నుంచి చివరి కథ ఎల్లలోకములు ఒక్కటై దాకా అన్నీ దేనికవే ప్రత్యేకం. తమిళ సినిమా మీద ఉన్న అభిప్రాయమే తమిళ సాహిత్యం మీద కూడా ఉంది నాకు. అరవ అతి, నేను చిరాకు పడే ఒకానొక విషయం. అయితే, too much ఓవర్ యాక్షన్ చేస్తారు లేదా too much realistic చేస్తారు. Too much నాకెప్పుడూ నచ్చదు. కానీ ఈ కథలు నాకు too much గా నచ్చాయి. ధర్మం కథ […]

SUBSCRIBE

Chaaya - Subscription
Shopping cart close