చక్కగా ప్రతి పేజీలో మట్టి వాసన వచ్చేలా పుస్తకం రాసుకుంటే ముందు మాట రాసిన వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మార్మికత అంట గట్టేసి ఒక్కొక్క డొంక దారిలోకి తీసుకెళ్ళి వదిలేశారు. #లంకమల దారుల్లో
మట్టి వాసనకి (మార్మిక భాషలో ఎదురవుతున్న) అధి భౌతికతకు మధ్యన ఉన్నది రెండు ధ్రువాల మధ్యన ఉన్న అంతరం అని ఎవరన్నారో తెలియదు.
HD Thoreau అన్నవాడు Ralph Waldo Emerson, Walt Whitman అమెరికన్ transcendentalist వరసలో వచ్చిన మనిషి. ఆయన రాసిన Walden Pond లో చూపిన మార్గం గాంధీ గారి సత్యాన్వేషణ కి ఒక ఇన్స్పిరేషన్. ఆ పుస్తకంలో ఉన్న మట్టి వాసనలు అధిభౌతికతలను పోలినట్టు అగుపడేవి ఏవో కొన్ని “లంకమల దారుల్లో” లేవని కాదు. ఉన్న వాటిని పేర్కొని, దానికి సమగ్రంగా ఒక సందర్భం కల్పించి ఉంటే బాగానే ఉండును.
వివేక్ కి తన ప్రయాణం లో ఎదురయినా “తాను” ఎవ్వరు? ఎటువంటి మనిషి ? వాడు స్థలకాలాలకు అతీత మైన మానవ స్వరూప మా లేక నేల మీద కాళ్ళు ఉంచి తనను తాను locate చేసుకుంటూ నడవటానికి ప్రయత్నిస్తున్న మిలేనియల్ బ్రహ్మంగారి మానవాంశమా? అది ఏ రకమైన నరావతారము? ఇది ముందుమాటలు రాసిన వాళ్ళు తేల్చుకోలేక పోయారు అన్నది తెలుస్తూనే ఉంది.
తెలియని దాన్ని తెలియదు అని వినయంగా ఒప్పుకుని రాసి ఉంటే ముందు మాటలు పుస్తకానికి కరదీపికలుగా బాగా వచ్చి ఉండేవి. ఆ వినయం లేక పోవటం వలన ముందు మాటల్లో కనపడేది విన పడేది పదాల దూకుడు మాత్రమే. వీటిని ముందు మాటలు గా కాక “వెనక మాటలుగా” పెట్టేసి ఉంటే ఈ మాత్రం కూడా ఆలోచించాల్సిన పని ఉండేది కాదు.
ఇప్పుడైనా ఇంతకన్నా వివరంగా మాట్లాడుకోవటం అనవసరం. పుస్తకం చదవండి. ఆ తరువాత ముందు మాటలు చదవండి. ఈ కామెంట్ చదివి ఇక్కడే వదిలేయండి.