మరో కోణం పరిచయం చేసే నవల
2018 లో అనుకుంటా. ఆఫీస్ అయిపొయ్యేసరికి రాత్రి 9.30 దాటింది. పార్కింగ్ లోనుంచి బయటికి రాగానే వర్షం తగ్గిన తర్వాతొచ్చే చల్లగాలి వణికించింది. మళ్లీ వర్షం వచ్చేలోపు క్రిష్ణానగర్ చేరుకోవాలని శిల్పారామం మీదుగా 100 ఫీట్ రోడ్డెక్కింది నా అపాచీ బైక్. ట్రాఫిక్ తక్కువుండటంతో బైకు వేగం పెరిగేకొద్దీ వెంట్రుకలు నిక్కబొడుచుకుంటున్నాయి. మాధాపూర్ వైయస్సార్ విగ్రహం దగ్గర లిఫ్ట్ కావాలంటూ ఎవరో చెయ్యెత్తారు. చూస్తూనే చెప్పొచ్చు ఎవరో లేబర్ పని చేసుకునే అతను అని. ఆ రూట్ …