వాన ఎప్పుడూ ఒకేలా ఉండదు. తుంపర్లుగా, చినుకులుగా, ఎడతెగకుండా, కుండపోతగా. ఆ చివరిది ఉందే అది దుర్మార్గమైనది. పడినది పడినట్లు నేలలోకి ఇంకదు. ప్రవాహమై పోదు. కురిసినంత మేరా తన పరిథే అని ప్రకటిస్తుంది. ఇది తన పరిథిని చెప్పిన కథ.
ఎప్పుడైనా వానలో చిక్కుబడ్డావా? కనీసం ఇల్లు కురుస్తోన్నప్పుడు ఇంట్లో గిన్నెలు పెట్టావా? ఇంట్లోకి నీళ్లు రాకుండా ఇంటి ముందు మట్టితో కట్ట కట్టవా? లేదూ అంతా అయిపోయాక వరద ప్రాంతాల్లో నాలుగు అడుగులు నడిచావా? అయితే, ఇందులో నిన్ను నీవు చూసుకుంటావు. నీవొక జర్నలిస్టువైనా, ఒక సోషల్ వర్కర్ వి అయినా, ప్రభుత్వ యంత్రాంగంలోనో, యంత్రాంగంతోనో పనిచేసినా ఇందులో ఘటనలు తరచి చూసుకోగలవు.
నూరు పేజీల నవలే కానీ బతుకంత విస్తారమైంది. వానంత తీవ్రమైనది.
Reviews
There are no reviews yet.