చిక్కగా మబ్బు పట్టిన సాయంకాలమో, ఒక చిరకాల మిత్రుని పలకరింపో, దూరమైన ఆత్మీయుల గురించిన ఆలోచనో, ఇంకా కొన్ని కొన్ని సమయాలు మనల్ని పాత రోజుల్లోకి లాక్కెళ్తాయి. ఆ క్షణాల్లో అప్రయత్నంగానే పాత డైరీలో పేజీల్నో, పాత ఉత్తరాల్నో చేతుల్లోకి తీసుకుంటాం. ఎప్పటెప్పటివో పాత పాటల్ని వింటూ కూర్చుంటాం. అందులో ఒక ఆనందం, ఒక విషాదం, ఒక ఆర్తి, ప్రకటించలేని ఒక అస్థిమితం మనల్ని అలా గంటలు గంటలు వర్తమానపు ప్రాపంచిక చైతన్యానికి దూరంగా తీసుకెళ్లిపోతాయి.
Reviews
There are no reviews yet.