₹400.00
1870 లో సమయంలో దేశంలో వచ్చిన కరువు ప్రపంచ చరిత్రలోనే అతి పెద్దది. అందులో ఇరవై ఐదు శాతం మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. వారిలో అత్యధికులు నిమ్న వర్గాల వారే. దానికి ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వ విధానాలు, దోపిడీ కారణం. కానీ మన న్యాయాన్యాయ విచక్షణ కూడా దానికి తోడ్పడింది. ఏదో ఒక రకంగా మనం కూడా జరిగిన విధ్వంసానికి సమష్టిగా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ నవల మనలో ప్రతి ఒక్కర్నీ దోషిగా నిలబెడుతుంది. ఇప్పటికైనా మనల్ని మనం పరీక్షించుకోవాలి. చరిత్ర పుటల్లో అంతులేకుండా రగులుతున్న జ్వాలల్లోకి మన నిస్సారమైన వాదనలు, పనికిమాలిన సమర్థనలను విసిరేయడం మనం మానుకోవాలి. – జయమెహన్