₹125.00
ఇలాంటి కథ రాయటానికి పెద్ద ఊహ అవసరం లేదు, గొప్పగా వాక్యాన్ని దిద్దే నైపుణ్యాన్ని చూపించే పనీ లేదు. కేవలం మనం ఉన్న సమాజాన్ని, దానిలోని మార్పులనీ నిరంతరం గమనించే బాధ్యత, కొత్తగా వచ్చే మార్పులని మరింత మందికి చెప్పాలన్న తపనా ఉంటే చాలు. అయితే, అది అంత సులభం కాదు. ఊహ చేసి కథ రాయటం కన్నా వాస్తవ పరిస్థితులని వ్యాసంగా గాక కథగా చెప్పటం చాలా కష్టం. అయితే… ఇది కథ కాబట్టి ఒకప్పుడు భర్తతోనూ, అతను పోయాక ఈ సోకాల్డ్ సమాజంతోనూ పోరాడిన సావిత్రి “అప్పటికి” గెలవగలిగింది. రేపు వచ్చే కొడుకు భాస్కరంతో కూడా పోరాడగలుగుతుందా? ఈ ఒక్క ప్రశ్నను మనకు వదిలేసి కథను ముగించటం వల్ల… రచయిత్రి చదివే పాఠకులని కూడా కథలో ఇన్వాల్వ్ చేయ్యటం ఒక అద్భుతమైన టెక్నిక్. నిజానికి ఈ కథ 40లు దాటిన వాళ్లకి పాత అనుభవాలను గుర్తుకు తెచ్చేదైతే, ఈ కాలంలో ఉన్న పిల్లలకు జెండర్ సంబంధం లేకుండా ఒక లైఫ్ స్కిల్ లెసన్ లాగా సిలబస్లో చేర్చుకోవాల్సిన పుస్తకం.
– నరేష్కుమార్ సూఫీ
ఈ కథ 40లు దాటిన వాళ్లకి పాత అనుభవాలను గుర్తుకు తెచ్చేదైతే, ఈ కాలంలో ఉన్న పిల్లలకు జెండర్ సంబంధం లేకుండా ఒక లైఫ్ స్కిల్ లెసన్ లాగా సిలబస్లో చేర్చుకోవాల్సిన పుస్తకం.