ఇది విస్మృత చరిత్ర.
బ్రిటిష్ ఇండియాను పాలిస్తున్న కాలంలో నమోదుకు నోచుకోని చరిత్ర. అలెక్స్ హేలీ రూట్స్ ప్రపంచాన్ని కుదిపేసిన రచన. కుంటా కింటే తన మూలాలని వెతుక్కుంటూ పోయినట్లు, ఇక్కడ కార్టర్ అనే బానిస కూడా వెతుక్కుంటూ పోయాడు. అయితే రూట్స్ లాగా ముందునుండి వెనక్కి నడచిన నవల కాదు. ఒక వరుస క్రమంలో చరిత్రలో జరిగిన ఘటనలను గుదిగుచ్చిన నవల.