ఏ అనుభవమూ నిరూపితం కాని, వివిధ అభిప్రాయాలు కలుషితమైన ఈ సత్యోత్తర కాలంలో ‘కథలను నమ్ము, కథకులను కాదు’ అనే ప్రసిద్ధాక్తిని కాస్త మార్చి ‘కథనాన్ని నమ్ము, కథను కాదు’ అని కూడా చెప్పవచ్చునేమో!
ఈ నవల అలాంటి సూచన ఇస్తున్నట్టుంది. ఇక్కడ ఏదో ఒకటి జరిగి దానికి పీటముడివేసి ఇంకేదేదో జరుగుతూ సాగుతుంది. కాని నవల ఉన్నది జరిగినదాని గురించో లేదా జరిగిందని గ్రహించినదాని గురించో లేదా జరగదగిన అవకాశాల గురించో ఇలాంటి ప్రశ్నలు ఈ నవలలో పాఠకుడు అనే విక్రమాదిత్యుడిని బేతాళుల్లాగా వేధిస్తాయి. అలాగే కథ కనిపించే తీరు మూలకంగా పాఠకులకు – స్వతః లోకమే అలా వుండవచ్చునా, స్థిరమూ, నిశ్చితమూ అని మనం భావించే ఈ జీవన వ్యాపారాలు కేవలం మనోనిర్మితాలేనా? – అనే ఒక అనుమానం ఉద్భవిస్తే అది కాకతాళీయం కాకపోవచ్చునేమో..?
Reviews
There are no reviews yet.