ప్రేమ అంటే ఏమిటి? అని అనేక కవితలు, కథలు వచ్చాయి. పొలిటికల్ చర్చా జరిగింది. అయినా, ప్రేమ ఎప్పుడూ నిత్యనూత్నంగా మళ్ళీ మళ్ళీ ఎదను తాకుతూనే ఉంది. తాకిన ప్రతి మనిషీ దానికి కొత్త బాష్యం చెబుతూనే ఉన్నాడు./ ఉంది. అట్లా తనను తాకిన ప్రేమను చెప్తూ
“ప్రతీ కథ చివర
నీదో… నాదో…
ఒక పేరు పలుకుదాం
ఆకాశంలో చీకటి కళ్లాపు జల్లాక
ఎవరి పేరు పైన కథ ఆగితే
వాళ్ల ఒడిని తలగడ చేసి
వాళ్ళ పేరుతో రాత్రికి
ఒక కొత్త ప్రేమను
అద్దుదాం.” అని అంటున్నాడు శేషు.
ప్రేమ అంటే ఏమిటి? అని అనేక కవితలు, కథలు వచ్చాయి. పొలిటికల్ చర్చా జరిగింది. అయినా, ప్రేమ ఎప్పుడూ నిత్యనూత్నంగా మళ్ళీ మళ్ళీ ఎదను తాకుతూనే ఉంది. తాకిన ప్రతి మనిషీ దానికి కొత్త బాష్యం చెబుతూనే ఉన్నాడు.