రెండో శతాబ్దంలో ఆసియా ఖండపు ప్రజలు పెద్ద ప్రపంచీకరణను ఎదుర్కొన్నారు. కుశాన సామ్రాజ్యం రాజు కనిష్కుడు వాయువ్య భారతాన్ని పాలిస్తున్న సమయంలో చీనా దేశం నుంచి రోమ్ దేశం వరకూ కాలినడకన సాగే అనేక వర్తకపు దారులు పుట్టుకొచ్చాయి. ఈ కాలంలో వాహనానాలను ఉపయోగించి ఆ దారిని పూర్తిగా దాటడానికి అసాధ్యమైనప్పటికీ, పద్దెనిమిది వందల ఏళ్ళ క్రితం ప్రపంచ పటపు జ్ఞానం లేని మన పూర్వీకులు వ్యాపార దృష్టితో ఈ క్లిష్టమైన దారిపొడవునా అడుగుజాడలను ఏర్పరిచారు. వేలాది మైళ్ళ ఈ దారి అనేక పర్వతాలు, ఎడారులు, నదులు, వాగులు అడవులు, జనావాస ప్రాంతాలను దాటిపోయింది. ఈ కాలపు ప్రపంచ పటంలోని దేశాలైన చీనా, కఝకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, భారత్, పాకిస్తాన్, ఇరాన్, ఇరాక్, టర్కీ-ఇలా అనేక దేశాలను దాటిపోయే ఈ దారి వ్యాపారోద్దేశం కోసం సంభవించినప్పటికీ, దానికోసమే పరిమితం కాలేదు. ధర్మాలు, భాషలు, లిపులు, నైపుణ్యాలు, కళా ప్రక్రియలు, సాంకేతిక జ్ఞానాలు-ఇలా అనేక వాస్తవాలు ఈ దారి గుండా అటుఇటు ప్రయాణించాయి. ఆ కాలంలోని జనులు వీటన్నిటినీ తమ అవసరాలకు తగినట్లు అలవరుచుకుని కొత్త జగత్తును సృష్టించుకోవటంలో సఫలమయ్యారు. ఈ నవల రెండో శతాబ్దంలోని ఆసియా ఖండంలోని అనేక చారిత్రక విషయాలను దృష్టిలో పెట్టుకుని, ఆ నాటి యుగసంఘర్షణ సామాన్య ప్రజల్లో తీసుకుని వచ్చిన సవాళ్ళను కాల్పానికమైన కథ మూలకంగా మీ ముందు పెట్టడానికి ప్రయత్నిస్తోంది. అనేక దేశాల, అనేక ధర్మాల విస్తృత అధ్యయనం చేసి రచయిత ఈ నవలను రాశారు.
Novel, Translations
Pattu Thova
Original price was: ₹475.00.₹400.00Current price is: ₹400.00.
+ 40 ₹ (Postal charges)Author – Vasudhendra
Translator – Ranganatha Ramachandrao
Pages – 438
Reviews
There are no reviews yet.