జీవితం ఓ కల్లోల సముద్రం లాంటిది. ఎగిసిపడే అలల హెూరు మాత్రమే పైకి కనిపిస్తుంది. కానీ సముద్ర అంతరాంతరాల్లో ఎడతెగని సంఘర్షణ ఉంటుంది. అది సముద్రానికే తెలుసు. మనిషి జీవితంలోనూ అలాంటి సంఘర్షణే. కొన్ని కలలు… కొన్ని కన్నీళ్లు… కొన్ని జ్ఞాపకాలు… కొన్ని గాయాలు… అన్నీ కలిసి జీవితాన్ని సుసంపన్నం చేస్తాయి. అలాంటి జీవితాల సంకలనమే నీళ్ళకోడి. పేరెన్నికగన్న తమిళ రచయితల కథా సంకలనం ఇది. కాల్పనిక సాహిత్యమే కావచ్చు. కానీ… ఇందులో జీవితం ఉంది. జీవితంలోని ఎదురీత ఉంది. సముద్రపు లోతుల్ని చూడాలనే కసి ఉంది… ఆకాశపుటంచుల్ని తాకాలనే ఆకాంక్ష ఉంది. అలాంటి ఆరాటాల్ని… జీవిత పోరాటాల్ని అక్షరాల్లోకి తర్జుమా చేశారు రచయితలు.
ప్రముఖ సినీ దర్శకులు పా.రంజిత్, జయకాంతన్, అశోక మిత్రన్, చంద్ర, ఎం.గోపాలకృష్ణన్, ఉమా మహేశ్వరి, తామరై, కె.పి.రాజగోపాలన్, జయమోహన్, ఇందిరా పార్థసారథి, కల్కి, ఎస్.రామకృష్ణన్, సారోన్, శాంతాదత్ రాసిన 15 కథలను జిల్లేళ్ళ బాలాజీ తెలుగులోకి అనువదించారు. ఇప్పుడా కథలను ఛాయ తెలుగు పాఠకుల ముందుకు తెస్తోంది.
Reviews
There are no reviews yet.