₹160.00 Original price was: ₹160.00.₹140.00Current price is: ₹140.00.

మొగిలేరు (సొర్నముకి నదికి తొలి పేళ్లు) ఇసక దారిన మరొక్కతూరి మా పల్లికొచ్చి మా మణుసుల కతలు ఇనండి. దేవుళ్ళ కతలు సదివినా ఇన్నా పున్నిం అంటారు గదా అదే మాదిర్న మా ఊరి మణుసుల కతలు ఎన్నితూర్లు సదివినా ఇన్నా కూటినీళ్లు కుడిపినట్టు కడుపు సల్లబడతాది. కల్లునీళ్లతో తడిపినట్టు ఉల్లం ఉఱం మోగతాది. నా సిన్ననాటి కాలాన్ని అల్లుకోని బతుకంతా గెవణపు పూలు పూసే ఏటిగట్టు గుబురు కొక్కిరి తీగలంటి ఈ కతల్లోని మా పల్లి మణుసులే లేకపొయ్యుంటే ఈ కతలు గూడా లేకపోను. అందుకనే వోళ్లందరి మట్టి కాళ్లకి పేరు పేరునా దండాలు చెప్పుకుంటుండాను.