మోహనస్వామి తన దీర్ఘకాల సహచరుడు కార్తీక్ పోగొట్టుకున్నాడు; అందమైన ఒక ఆడది అతడిని లాక్కున్నది. తన బాల్యం, జీవితపు ఎంపికలు, నిరాశా క్షణాలు, సంపాదించుకున్న, పోగొట్టుకున్నప్రేమికులు, మిత్రులు–అన్నిజ్ఞాపకాలూ చితిలా అతడిని కాల్చుతున్నాయి. అలాగని అతడి కోరికలు గొప్పవేమి కావు. ఒకింత ప్రశాంతమైన, గౌరవనీయమైన సాధారణ జీవితం కోసం అల్లాడుతున్నాడు. గత జీవితపు గాయాలు, అవమానం, భయం, ఆటంకం మరియు నిరాశ–అన్నిటినీ మరిచిపోయేటంతటి కొత్తజీవితం కోసం తపిస్తున్నాడు. ‘ఆడంగి వెధవ’, ‘ఆడపులి’–ఇలా ఎన్నెన్నోపాడు ఉపనామాలతో ఈ సమాజం అతడికిచేసిన గాయాలు మాసిపోవలసి ఉంది. ‘గే’ జీవితపు చీకటి కోశం నుంచి స్వయంగా రచయితే బయటికిరావడానికికనుక్కున్నచివరిదారిగా ఈ పుస్తకం రూపుదిద్దుకుంది. పురుషుల-పురుషుల నడుమ ప్రేమకు, కామానికిసంబంధించిన కథలనుజీర్ణించుకోలేని సంప్రదాయపరులైన పాఠకులు ఉలిక్కిపడ్డారు. స్వేచ్ఛాయుతమైన శైలితో చిత్రించే మోహనస్వామి కథల్లోలైంగికత, నగరీకరణ మరియు వర్గ సంఘర్షణలు దహించివేసేనిజాయితీతో రూపొందాయి. పాఠకులనుఒకింతసేపు కలవరపరుస్తాయి. ఇంగ్లీషు, మళయాళం, స్పానిష్ భాషల్లోప్రచురింపబడిన ఈ పుస్తకం తెలుగు ప్రచురణ ద్వారా కన్నడ సాహిత్యంలోని అత్యంత ముఖ్యమైన ఒక ధ్వనిని పాఠకులకు మేము పరిచయం చేస్తున్నాం.
Short Stories, Translations
Mohanaswamy
₹200.00
+ 40 ₹ (Postal charges)స్వేచ్ఛాయుతమైన శైలితో చిత్రించే మోహనస్వామి కథల్లోలైంగికత, నగరీకరణ మరియు వర్గ సంఘర్షణలు దహించివేసేనిజాయితీతో రూపొందాయి. పాఠకులనుఒకింతసేపు కలవరపరుస్తాయి. ఇంగ్లీషు, మళయాళం, స్పానిష్ భాషల్లోప్రచురింపబడిన ఈ పుస్తకం తెలుగు ప్రచురణ ద్వారా కన్నడ సాహిత్యంలోని అత్యంత ముఖ్యమైన ఒక ధ్వనిని పాఠకులకు మేము పరిచయం చేస్తున్నాం.
Author – Vasudhendra
Translator – Ranganatha Ramachandrao
Pages – 254
Categories: Short Stories, Translations
Tags: Ranganatha Ramachandrao, Short Stories, Translations, Vasudhendra
Reviews
There are no reviews yet.