98 పేజీల నవల. గట్టిగా చదివితే గంటన్నర, రెండు గంటలు. కథల్లో, నవలల్లో హ్యుమరసం తగ్గింది అనుకునే వాళ్లకి ఫుల్ మీల్స్ ఈ నవల. నడుస్తున్న కాలం మీదా, చరిత్ర మీద తెలిదేవర భానుమూర్తి సంధించిన వ్యంగ్యాస్త్రం. ఈ హ్యుమరస నవల గురించి శివాజీ తల్లావజ్ఝల రాసిన ముందుమాటలో నాలుగు వాక్యాలు.
“గతంలో ఒకనాడు అబూ అబ్రహం వంటి కార్టూనిస్టులు ఒక ప్రశ్నతో చికాకు పడ్డారు. తమ కార్టూన్లలో హ్యుమరసం చురుక్కుమనిపించగల సున్నిత స్థాయిలో రాజకీయాలు లేవు కనుక అసలు కార్టూనింగ్ మానుకోవాలా? అనుకునే దాకా జరిగింది కథ. అంటే రాజనాల విలన్ హాసం చేస్తుండగా శ్రీమతి కృష్ణ కుమారి కోపంగా అతనిపై పువ్వు విసిరనట్టన్నమాట.
ఏదీ అధికార రాకాసి మూకకు చీమ చిటుక్కుమనదు. గనుక వ్యంగ్యం మానుకోవాలా? అని రచయిత అనుకోరాదు. ఎంత సెటైర్‍కి అంత పదును. మాఫలేషు కదాచన వ్యవహారం! కాబట్టి మర్యాద మీరిన కోపం, ఘాటైన వ్యంగ్యం పూసిన పదాలుగా అస్త్ర సంధానం చెయ్యడం ముమ్మాటికీ ముఖ్యమని ఈ నవల మర్యాదగా చెప్తుంది.”
Reviews
There are no reviews yet.