₹185.00
ఈ పదహారు కథలలో పదమూడు కథలు స్త్రీలవే. ఆ పదమూడు కథలలో పది కథలు కౌమార దశ దాటి అప్పుడే యవ్వనంలోకి అడుగిడుతున్న యువతులవి.
వీళ్లంతా కొత్త తరానికి రెక్కలు సాచి ఎగరడానికి ప్రయత్నిస్తున్న ఆశావహులు. పసిపిల్లదాన్నైనా లైంగిక హింసకు గురి చేసే దౌర్భాగ్య మగత్వాలూ, ఇష్టమైన వాడిని ఎలా పెళ్లి చేసుకుంటుందని కట్టడి చేసే కులగౌరవాలూ, మధ్యలోనే చదువులు ఆపించేసి పెళ్లి పేరుతో అమ్మి తోసేసే పెంపకాలూ, అవార్డు ప్రలోభాల ఎరవేసి యువ సృజనలను అనుభవించాలని చూసే సాహిత్య పెద్దరికాలూ, నిబంధనల అడ్డంకులతో చదువులు తుంచేస్తున్న రాజ్యనిర్వాకాలూ యివీ ప్రగతి కథావస్తువులు. వ్యవస్థలోని ప్రగతిదాయకతను సవాల్ చేస్తున్న కథాంశాలు. ఇవన్నీ కొత్తతరం స్త్రీల పడబాట్లు. ఆశా ఆకాంక్షల మావిచిగుర్లు. అంతమాత్రమే కాదు ఆ నవ యువతుల క్రియలూ, చర్యలూ, నిర్ణయాలూ, సాహసాలూ యీ కథలు.
– జి. వెంకటకృష్ణ
వ్యవస్థలోని ప్రగతిదాయకతను సవాల్ చేస్తున్న కథాంశాలు. ఇవన్నీ కొత్తతరం స్త్రీల పడబాట్లు. ఆశా ఆకాంక్షల మావిచిగుర్లు. అంతమాత్రమే కాదు ఆ నవ యువతుల క్రియలూ, చర్యలూ, నిర్ణయాలూ, సాహసాలూ యీ కథలు.