కాలం ప్రవాహశీలం. సమాజం, అందులోని వ్యక్తుల ఆలోచన, ప్రవర్తన కూడా కాలప్రవాహంలో అనేక మార్పులకు లోనవుతాయి. ఆర్థిక, సాంస్కృతిక వ్యవస్థలలో అనేక పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఈ పరిణామాలు వ్యక్తుల జీవితాలలో కలుగజేసే సంఘర్షణ, దాని వలన కలిగే అవగాహన, అందులోనుంచి ఉద్భవించే కొత్త ఆలోచనలు ఎప్పటికప్పుడు చెప్పగలగడమే రచయితల కర్తవ్యం. ఆ కర్తవ్యాన్ని ఈ కథలు నిర్వర్తించాయి అని చెప్పడం నిజంగా సంతోషం.”
– పి.సత్యవతి
మారుతున్న ప్రపంచంలో, మారిన పిల్లల పెంపకపు పద్ధతులు, భార్య భర్తల అనుబంధాలు, ముందుతరం వారి జీవనవిధానం చెప్పే పాఠాలు, ఆధునిక జీవితం లోని ఒత్తిడికి నేర్చుకోవాల్సిన లైఫ్ స్కిల్స్, భారతీయతలో అంతర్లీనంగా సాగే ఆధ్యాత్మికత, సొంతంగా నిర్ణయాలు తీసుకొని జీవితంలో ముందుకు సాగిపోతున్న యువతరం – ఇలా పన్నెండు కథల్లో ఎన్నో అంశాలు, కొత్త ఆలోచనలు. జీవిత సత్యాలు, నేర్చుకోవాల్సిన పాఠాలు, నిలబెట్టుకోవాల్సిన విలువలు, ఆచరణలో చూపించాల్సిన ప్రమాణాలు అన్నింటినీ స్పష్టంగా చెప్పారు కథకురాలు.
– కల్పనా రెంటాల
Reviews
There are no reviews yet.