నవ్వడం మరిచిపోయిన రోజుల్లో మనసారా నవ్వించే నవల. ఒక ప్రయాణం, ఊహించని మలుపులు, సహ ప్రయాణీకులు. బాగా తెలుసనుకున్న వాళ్ళలో ఉండే తెలియని కోణాలు. అపరిచితులు అనుకున్న వాళ్ళనుండి దొరికే ఆశ్చర్యపరిచే ప్రేమ, ఆప్యాయత, స్నేహం. కోపం తెప్పించే వ్యక్తుల ప్రవర్తన వెనుక దాగుండే మనసును మెలిపెట్టే భావోద్వేగాలు. చిరాకులు, అరుపులు, చిరునవ్వులతో కూడిన, ఊపిరి తీసుకునే వ్యవధి కూడా ఇవ్వకుండా పరుగులు పెట్టిస్తూ చివరికి గుండెని, కంటిని తడిపెట్టించే పతాక సన్నివేశంతో ముగిసే నాన్ స్టాప్ ఎంటెర్టెయినెర్. మన హీరోలు పుస్తకంతో అనేకమంది ప్రశంసలు అందుకున్న సుబ్బు ఆర్వీ కలం నుండి సృజించబడ్డ కవ్వించే, గిలిగింతలు పెడుతూ నవ్విస్తూ ఆలోచన పంచే భావోద్వేగ రచన
– అరవింద్ జాషువా
Subbarao –
చాలా బాగుంది మీ book.బారిష్టరు పార్వతీశం book హాస్యం మళ్ళీ ఈ book గురుతు తెచ్చింది. మంచి కామెడీ and stress relief. బాబాయి character entry tho 200% strory in high level and ending with moral.