,

Hampi Express

200.00

+ 40 ₹ (Postal charges)

This Book is a collection of stories “Hampi Express ” written by Mr.Vasudhendra in Kannada. This book is translated into Telugu by Mr.Ranganatha Ramachandra Rao.

Author – Vasudhendra

Translator –  Ranganatha Ramachandrao

Pages – 241

హఠాత్తుగా అడిగిన ఆ ప్రశ్నకు చప్పున దేవిక కళ్ళల్లో నీళ్ళు చిప్పిలి, దానికి జవాబుగా తల వంచి కదిలించినపుడు, ఒక కన్నీటి బొట్టు ఆ గాజుబల్ల ‘మీద పడింది. వెంటనే జాగ్రత్తపడి ఆమె ‘ఐ యామ్ సారీ’ అని చెప్పి హ్యాండ్ బ్యాగ్ నుంచి కర్చీఫ్ తీసి తన కళ్ళను తుడుచుకోవటానికి ముందు ఆ గాజు మీద పడిన కన్నీటి బొట్టును కర్చీతో మెత్తగా ఒత్తి, అది పీల్చుకున్న తరువాత ఇంటర్వ్యూ చేసేవారిని తదేకంగా చూసి మరొకసారి విశ్వాసపు నవ్వు నవ్వింది. కళ్ళు చెదరగొట్టేలాంటి ట్యూబ్ లైట్ వెలుతురు ఆమె కళ్ళల్లోని తేమలో ప్రతిఫలించింది. ఆ ప్రశ్న అడిగిన కస్తూరికి బాధకలిగి, “క్షమించండి, మిమ్మల్ని బాధపెట్టడం కోసం ఈ ప్రశ్న అడగలేదు” అని స్పష్టంగా తెలిపింది. ప్రశ్న అంత క్రూరమైంది కాదని విశాలకు అనిపించినప్పటికీ, కస్తూరి వేసిన ప్రశ్న మరీ వ్యక్తిగతమైందేమోనని అనుమానం కలిగింది.

ఉదయం నుంచి చాలామంది అభ్యర్థులను ఇంటర్వ్యూ చేసిన విశాల్, కస్తూరిలకు విసుగొచ్చింది. అది రిసెషన్ సమయం. దుర్భిక్ష కాలం. ఖాళీగా ఉన్నది ఒక్కపోయినప్పటికీ యాభైమంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అన్ని చోట్లా కంపెనీలు లే ఆఫ్ చేసిన ప్రభావం వల్ల వేలాదిమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఖాళీగా ఇంట్లో ఉండిపోయారు. చిన్న కంపెనీలో ఉద్యోగం దొరుకుతుందంటే చాలు, దరఖాస్తు పెడుతున్నారు. మునుపటికన్నా తక్కువ జీతమైనా పరవాలేదు. అంతగా ఛాలెంజింగ్ లేకపోయినప్పటికీ ఓ.కె. మొత్తానికి వారం రోజులు ఒక కంపెనీకి వెళ్ళి పనిచేసి, వాళ్ళు ఇచ్చినంత తీసుకుంటే…….

Reviews

There are no reviews yet.

Be the first to review “Hampi Express”

Your email address will not be published. Required fields are marked *

Shopping Cart
Scroll to Top