₹499.00 Original price was: ₹499.00.₹400.00Current price is: ₹400.00.
గుండె! గుండెకు జబ్బు చేసేదాకా, తనలో గుండె ఉందన్న విషయం మామూలు మనిషికి తెలియదు! కనపడకుండా, వినపడకుండా, అవిరామంగా, లయబద్ధంగా తన పని చేసుకుంటూ, జీవనానికి అత్యవసరమైన రక్తం శరీర కణాలన్నింటికీ ప్రసరింపచేస్తుంది గుండె. నిముషానికి 70 సార్లు కొట్టుకునే గుండె, మూడు నిమిషాలు కొట్టుకోవడం మానేస్తే, మెదడు కణాలు నిర్జీవమై, జీవనయాత్ర అంతమవుతుంది!! చావుకీ, బతుకుకీ మధ్య దూరం 200 గుండె చప్పుళ్ళు!
రావులపల్లి సునీతగారు చేయి తిరిగిన రచయిత్రి. గుండె జబ్బుల నేపథ్యంలో, గుండె చికిత్సాలయం వాతావరణంలో ఒక మంచి నవల రచించారు. కథా వస్తువుల్లో, కథనంలో, కథలోని మలుపులలో, పాఠకులలో ఆసక్తిని, ఉత్కంఠని పుట్టించి, అఖరు పుటదాకా అగకుండా చదివించే ఉత్తమ శ్రేణి నవల ఇది.
– డా. చర్ల సూర్యప్రకాశరావు
ప్రొఫెసర్, కార్డియో థొరాసిక్ సర్జరీ