₹130.00 Original price was: ₹130.00.₹115.00Current price is: ₹115.00.
పలు భారతీయ కుటుంబాలు, తమ కుటుంబసభ్యులు ఏదో ఒక వ్యాపారరంగంలోకి దిగి, వ్యాపారం చేయడానికి ఉద్యుక్తులవుతున్నప్పుడు, నిరుస్తాహపరుస్తుంటాయి. వ్యాపారంలో ఎదురయ్యే నష్టాల వలన తమ కుటుంబసభ్యులు పేదరికాన్ని కౌగిలించుకోకూడదనేదే వారి భయం. వ్యాపారాన్ని మొదలుపెట్టడమంటే ఒక పర్వతాన్ని అధిరోహిస్తున్నట్లే! ‘అన్ని పర్వతాలపైన ఒక మార్గం ఉంటుంది. అయితే దానిని సమతల ప్రాంతం నుంచి చూస్తే కనబడదు’ అంటూ అమెరికన్ కవి థియోడర్ రోథ్కీ సూక్తిని ఆధారంగా చేసుకుని ఈ ‘కరెన్సీ కాలనీ’ పుస్తక రచనకు స్ఫూర్తి. వ్యాపార ప్రపంచాన్ని పరిపాలిస్తున్న కుటుంబాలు, తమ వారసులకు, వ్యాపారం అనే పర్వతమార్గ రహస్యాలను గురించి గుసగుసమంటూ చెబుతున్నట్లుగా, ఆ రహస్యాలనే కథలుగా, సంఘటనలుగా ‘కరెన్సీ కాలనీ’ ద్వారా అందరికీ చేరవేసే ప్రయత్నం చేస్తున్నాము.