బ్రేకింగ్ న్యూస్ ఎన్నో బ్రేకులు ఉన్న జీవితాలలోని మరెన్నో మలుపులమధ్య స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి. ప్రయాణాలన్నీ సాఫీగా సాగిపోతుంటే ఏమవుతుంది., రొటీన్ లైఫ్ లో ఉండే ప్రతి చిన్న మార్పు మనిషి మెదడుపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో వాటి వల్ల మానవ సంబంధాల్లో ఎలాంటి మార్పులు వస్తున్నాయో తన కథలోని చిన్న చిన్న పాత్రల ద్వారా దేశ రాజు గారు తన ప్రత్యేకతని చూపించారు
నిత్య జీవితంలోని వాస్తవిక ధోరణి ఉంటుంది. పాత్రల మధ్య కాల్పనికత ఎక్కడ కనిపించదు. వాస్తవ ప్రపంచాన్ని చూస్తూ పాత్రలు మనతో మన పక్కనే ఉండి సంభాషిస్తున్నట్లు ఉంటాయి కథలో కాస్త కొత్తదనం ఉంటుంది.
కథకి మెలుకువ ఎంత ముఖ్యమో దేశరాజు గారి కథల్లో మనకు అర్థమవుతుంది పెద్దగా నిడివి లేని పాత్రలు అలవోకగా వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి. చిన్న చిన్న అంశాలనే కథలుగా మలుస్తున్నప్పుడు ఎంత జాగ్రత్తగా వాతావరణాన్ని నిర్మించాలో అంత బాగా కథా నిర్మాణం జరిగింది. స్పష్టత, సూటితనముతో సరళమైన వాస్తవికత అతని కథల ప్రత్యేకతగా చెప్పవచ్చు. మానవత్వంలోని మెత్తదనం, వ్యంగ్యం వంటి లక్షణాలు మనకు తారసపడతాయి. వ్యక్తి అంతరంగాన్ని సమాజానికి ఉన్న సంబంధాన్ని సూచిస్తూ.. కథల్లో స్పష్టత కొన్ని పాత్రలు మన తో మాట్లాడుతున్నట్లు అర్థం చేసుకునేలా ఉంటాయి