Description
అధోలోకం హిందూ మత గ్రంథాల్లో చెప్పిన ఏడులోకాల్లో చివరిది. జన సామాన్యంలో పాతాళలోకంగా వాడుక. ఈ నవల పేరుకు తగినట్లే అధోలోకపు లోతుల్ని స్పృశించింది. ఇంద్రియాల వలన గానీ బుద్దితోగానీ గుర్తించే సూక్ష్మమైన బేధాలు కొన్ని వుంటాయి. దాన్నే సాహిత్యంలో న్యూయాన్స్ అంటారు. ఇది అట్లాంటి న్యూయాన్సెస్‌ని పొరలు పొరలుగా అల్లుతూనే ఒక అంతఃసూత్రాన్ని కలిగి వుండటం ఈ నవల ప్రత్యేకత. ఇది సమాజాన్ని, సమాజంలో వున్న మనషుల అధోలోకాల్ని చిత్రిక పట్టి మనముందు ఉంచింది. ఇందులో అత్యంత జుగుప్సాకరం అనిపించే అంశాలున్నాయి. ఇందులో మనం చూడ నిరాకరించేవి, చూసినా ఒప్పుకో నిరాకరించే అంశాలూ ఉన్నాయి. మనం రోజూ చూసేవే అయినా, మన కంటికి కన్పించే దృశ్యాల వెనుకాతల అధోలోకాన్ని మనకు పరిచయం చేస్తుంది. కథ ఇతివృత్తం బిక్షగాళ్ళ చుట్టూ తిరుగుతోన్నా ఇదొక లోతైన తాత్విక, మనఃప్రవృత్తిక, ఆధ్యాత్మిక తార్కిక నవల. చేదుగా, పచ్చిగా ఉంటూనే హాస్యం, సున్నితత్వం కలగలసిన నవల ఈ అధోలోకం.
Reviews
There are no reviews yet.