Description
సామాజిక పరిణామ దశలను వివరించే సందర్భంలో మోర్గాన్ ప్రతిపాదనలను ప్రధానంగా అనుసరించారు. ఆయా సామాజిక దశలు మారడం – మార్పులవల్ల ఏర్పడ్డ తరగతుల విభజనలను హేతుబద్ధంగా ప్రస్తావించటంలో మార్క్స్, ఏంగెల్స్, లెనిన్ తదితర సామాజిక శాస్త్రవేత్తల పరిశీలనలను ఆధారంగా స్వీకరించారు. అంతేకాక తరగతుల స్వభావ స్వరూపాల విశదీకరణ దశల్లోనూ వివిధ కాంప్లెక్స్లకు గురవుతూ వాటి ప్రభావాల వల్ల వచ్చే మనస్తత్వ లక్షణాల వివరణ సందర్భంలోనూ చిబ్బర్, ఆడ్లర్, ఫ్రాయిడ్ల భావనలనూ ఊతంగా తీసుకున్నారు.
రచయిత తను తీసుకున్న వస్తువును ప్రకరణాలుగా విభజించడంలో, సిద్ధాంత రీత్యా తన పరిశీలనలను వెల్లడించడంలో శాస్త్రీయతా, హేతుబద్ధతా, నిజాయితీతోబాటు సంయమనాన్ని కూడా పాటించడంలో శ్రద్ధ చూపించాడు. మొత్తం గ్రంథంలో – అంతర్లీనంగా వామపక్ష సామాజిక భావజాలం తాత్వికత ఉన్న అంశం పాఠకుడికి తెలుస్తుంది. ఎందుకంటే రచయిత తీసుకున్న వస్తువుకున్న ఆత్మ అదే కనుక.
Reviews
There are no reviews yet.