Chaaya Books

ఊహాలోకపు జీవితాలే కాదూ అధోలోకం జీవితాలూ తెలియాలంటే తప్పక చదవండి…

ఏడేడు పద్నాలుగు లోకాలున్నాయంటారు. మన భూలోకం పైన్నున్న ఊర్ధ్వలోకాల్లో కిన్నెర కింపురుషులు, దేవతలు. ఇక భూలోకం కిందున్న అధోలోకాల్లో వింత జీవులు, రాక్షసులు, పాములు, క్రిమికీటకరకాలు ఉంటారని చెబుతారు. ఆ లోకాలు మనకు కనిపిస్తాయో లేదో తెలియదు. అసలు మనలోకంలోనే ఉన్న అధోజగత్తు జనాల గురించీ తెలియదు. ఆ అధోలోక జనం గురించి వచ్చిన నవల జయమోహన్ గారి “అధోలోకం”. ఏ గుడికో, తిరుణాళ్లకో పోతాము. వింత, వికృతరూపాలతో ఉన్న ముష్టివాళ్లను చూడ్డానికి కూడా ఇష్టపడము. చూడటానికే […]

ఎన్నో రహస్యాలు ఛేదించబడ్డాయి

నా ప్రొఫైల్ పిక్ లో ఉన్న స్కర్ట్ వేసుకొని లాస్ట్ ఆదివారం బుక్ ఫెయిర్ కి వెళ్తే, కొంతమంది అదే పనిగా నన్ను ఎగాదిగా చూస్తూ కనిపించారు. నా skirtకి ఉన్న slitలో నుండి అడపాదడపా తొంగిచూస్తున్న నా మోకాలు & తొడ వాళ్ళని బాగానే disturb చేశాయని అర్ధమైంది. ఈలెక్క, నేను shorts వేసుకొని వస్తే వాళ్ళు అక్కడికక్కడే చస్తారేమోనని పక్కనే కూర్చున్న అరుణాంక్ తో అన్నాను. ఇంతలో ఇద్దరికీ కొన్ని డౌట్లనుమానంస్ వచ్చాయి – […]

యుద్ధం – ప్రేమ రెండిటినిచక్కగా బ్యాలెన్స్ చేసిన కథ

మారుతి పౌరోహితం గారు రచించిన ఈ చారిత్రక కాల్పినక నవల మనలను విజయనగర సామ్రాజ్యంలో జరిగిన రాక్షస తంగడి యుద్ధం కాలానికి తీసుకెళ్తుంది.. శ్రీకృష్ణదేవరాయలు చనిపోయిన తర్వాత ఆయన అల్లుడు అళియరామరాయుల కాలంలో జరిగే ఓ యుద్ధం మరియు ఓ ప్రేమ కథ ఇందులో మిళితమై ఉన్నాయి.. చరిత్రలో నిలిచిపోయిన రాక్షస తంగడి యుద్ధం హంపి విధ్వంసం గురించి మనకు వాటి గురించి తెలుసుకోవాలని ఉత్సుకత ఉంటుంది.. ఆ యుద్ధం వివరాలను ఆ యుధ్ధం జరిగే తీరును […]

ఇదో అద్భుతమైన చిన్న నవల

కన్నడనాట కథకుడుగా, నవలాకారుడిగా, నాటక కర్తగా, విమర్శకుడిగా, అనువాదకుడిగా ప్రసిద్ధులైన డా. కృష్ణమూర్తి చందర్ గారు వ్రాసిన మినీ నవల ఈ కాంచన సీత. దీనిని తెలుగులోకి అనువాదం చేసిన వారు సుప్రసిద్ధ అనువాద రచయిత రంగనాథ రామచంద్రరావు గారు. వీరు ఇప్పటివరకు కన్నడ నుండి తెలుగులోకి 19 నవలలు, 18 కథాసంకలనాలు, 5 ఆత్మకథలు, ఒక జీవిత చరిత్ర అనువదించారు. వీరు చేసిన సాహితీ కృషికిగాను ఇప్పటి వరకు వీరికి కేంద్రసాహిత్య అకాడమీ పురస్కారం, పొట్టిశ్రీరాములు […]

“వంద కుర్చీలు” కథ నన్ను పట్టుకొని వదలడం లేదు

కరడుగట్టిన నిచ్చెనల కులవ్యవస్థ అతి నికృష్టమైన రూపాన్ని మనం దేవతల భూమి అయిన కేరళలోనే చూడగలమేమో! నాయాడి కులం “చూడరాని” కులం. నాయాడిని ఎవరైనా చూస్తేనే మైల పడతారు. అంతేకాదు.. చూడకపోయినా, సవర్ణుడికి దగ్గరలో 300 అడుగుల లోపల నాయాడి వున్నా మైల పడతారు. ఈ దూరం కులాన్ని బట్టి మారుతుంది. 300 అడుగుల కంటే లోపల నాయాడి వుంటే నంబూద్రి బ్రాహ్మణుడు మైల పడితే, 70 అడుగుల లోపలుంటే శూధ్రుడు మైల పడతాడు. ఈ చూడరాని, […]

ఆగి ఆగి చదువుతూ, కారుతున్న కన్నీళ్ళని ఆపుకుంటూ

నెమ్మి నీలం పూర్తిచేసాను. 430 పేజీలు చదవడానికి దాదాపు నెలరోజులు పట్టింది. గబగబా చదివేసి పక్కన పెట్టడానికి ఇదేం పల్ప్ ఫిక్షన్ కాదుగా! ఆగి ఆగి చదువుతూ, కారుతున్న కన్నీళ్ళని ఆపుకుంటూ, గడ్డకట్టిన దుఃఖంతో గొంతు నొప్పెడుతుంటే నేనెందుకు చదవాలీ పుస్తకాన్ని? చదివాను పో.. ఇంత బలహీనమైన గుండె నాకెందుకివ్వాలి? ఈ నెలరోజుల్లో ఈ పుస్తకాన్ని పక్కన పెట్టుకుని ఎన్ని రాత్రులు ఏడ్చి వుంటాను! మరోసారి “అమ్మవారి పాదం” కథ ఆడియో ఫైల్ వింటూ ” నాకు […]

గ్రామీణ సమాజం పట్ల ఆపేక్ష వున్న వారు, కార్మికుల పట్ల అనురక్తి వున్నవారుతప్పక చదవవలసిన పుస్తకం

 గ్రామీణ కార్మికులకు ఒక ఏడాదిలో 100 రోజులు పని కల్పించే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం మరియు ఇతర సంక్షేమ పధకాలు అమలౌవుతున్న తీరును క్షేత్రస్తాయిలో పరిశీలిస్తున్న పరిశోధకులలో బుద్ధ చక్రధర్ ఒకరు. ‘పరిశోధన’ అంటే అదేదో పి హెడి (Phd) కోసం చేసే పరిశోధన కాదు. పథకాల అమలులో వాటి విధి విధానాలు, ప్రభుత్వాలు ఏకపక్షంగా తెస్తున్న మార్పులు, చేర్పుల వలన లబ్దిదారులు ఎలా నష్టపోతున్నారో సాక్ష్యాధారాలతో ఎత్తిచూపించే పరిశోధన చక్రధర్ […]

అన్ని కథలూ దేనికవే ప్రత్యేకం. తప్పకుండా చదవాల్సిన పుస్తకం

ఫేస్బుక్ లో కొన్ని పోస్టులను చూసి, చాలా రోజులకు ఒక పుస్తకాన్ని చదవాలనే బలమైన కాంక్ష కలిగింది. అలా “నెమ్మి నీలం” చేతికి అందగానే 450 పేజీలను ఆపకుండా చదివేసాను. రచయిత స్వగతంతోనే ఉద్వేగం మొదలయింది. అవినీతి పైన ఉద్యమం ద్వారా మార్పు వస్తుంది అనే ఆయన కల నెరవేరక పోతే ఆయనలో ఒక స్తబ్ధత ఏర్పడింది. ఆ స్తబ్ధత తొలగించుకోవటానికి చేసిన అన్వేషణలో, నేడున్న పరిస్థితుల్లో ఆచరణాత్మక ఆదర్శ వాదానికి గాంధీయ సిద్ధాంతం తప్ప మార్గాంతరం […]

ప్రతి కథా చదువరుల్ని వెంటాడుతుంది

బ్రహ్మ పుస్తక సాహిత్య ఉత్సవంలో ప్రధాన ఆకర్షక (ఆకర్షణ కాదు ఆకర్షక సరైందని నా విద్యార్థి దశలో రాళ్ళపల్లి అనంత కృష్ణశర్మ గారు ఒక సభలో అనగా విన్నాను) వ్యక్తి. అంత వరకు అతని పేరు కూడా వినలేదు. రచనా తెలియదు. ఆ మూడు రోజులు నాలుగు రాష్ట్రాల రచయితలు, కళాకారులతో అద్భుతంగా సాగిన కాలం ఈ జయమోహన్ పేరుతో ఆగింది. ఛాయా పబ్లికేషన్స్ వారు నెమ్మి నీలం పేరుతో వేసిన పుస్తక ఆవిష్కరణ కిక్కిరిసిన శ్రోతల […]

ఇలా కూడా రాయొచ్చా?

ఇలా కూడా రాయొచ్చా ? అయితే నేను కూడా రాయొచ్చు ! అనిపించిందట కాఫ్కా రాసిన మెటామార్ఫసిస్ చదివాక మార్క్వేజ్ కి. అప్పటికి మార్క్వేజ్ రచయిత కాలేదు. దీన్నిబట్టి రచయిత కాదు అతని వర్క్ మాట్లాడాలి, పిచ్చెత్తించాలి, ఈడ్చుకుపోవాలి, అప్పటివరకు ఎరుగని లోవెలితిని చూపించి అశాంతితో మండించి బూడిద చెయ్యాలి. ఆ బూడిదలోంచి కొత్తజన్మ ఎత్తించాలి. ఇదంతా కళాకారుడు కాదు, అతని కళ చేయాలి. నిజానికి తాను జీవితంలో అనుభవించిన ఘోరమైన దశల్నే మండే అక్షరాలుగా మలచినవాడు […]

SUBSCRIBE

Chaaya - Subscription
Shopping cart close