Jon Fosse

Jon Fosse

యున్ ఫొస్సా నార్వేజియన్‌ రచయిత. నవలలు, నాటకాలు, కవితలు, బాలల పుస్తకాలు, వ్యాసాలు రాశారు. బోధకుడిగా, అనువాదకుడిగా పనిచేశారు. ఆయన 2023లో సాహిత్యానికి నోబెల్ బహుమతిని అందుకున్నారు.

వ్యక్తీకరించలేని భావాలకు గొంతుకనిచ్చే ఆయన వినూత్న శైలిలో రాసిన నాటకాలు, వచన రచనలకుగాను ఈ పురస్కారం లభించింది. ఈ బహుముఖ సాహితీవేత్త, నార్వేజియన్ భాషలోని రెండు లిఖిత రూపాలలో అరుదైన న్యూనార్క్స్‌ (న్యూ నార్వేజియన్‌), బోక్‌మాల్‌ భాషలో 40కిపైగా నాటకాలు, 30కిపైగా కాల్పనిక రచనలు చేశారు.