మారుతి పౌరోహితం గారు రచించిన ఈ చారిత్రక కాల్పినక నవల మనలను విజయనగర సామ్రాజ్యంలో జరిగిన రాక్షస తంగడి యుద్ధం కాలానికి తీసుకెళ్తుంది.. శ్రీకృష్ణదేవరాయలు చనిపోయిన తర్వాత ఆయన అల్లుడు అళియరామరాయుల కాలంలో జరిగే ఓ యుద్ధం మరియు ఓ ప్రేమ కథ ఇందులో మిళితమై ఉన్నాయి..
చరిత్రలో నిలిచిపోయిన రాక్షస తంగడి యుద్ధం హంపి విధ్వంసం గురించి మనకు వాటి గురించి తెలుసుకోవాలని ఉత్సుకత ఉంటుంది.. ఆ యుద్ధం వివరాలను ఆ యుధ్ధం జరిగే తీరును మనకు కళ్ళకు కట్టినట్లు రచయిత వివరిస్తాడు మనం ఆ యుద్ధ భూమిలో ఉన్న అనుభూతిని పొందుతాం
ఇందులో అంతర్లీనంగా రాజు అంగరక్షకుడైన సంబజ్జ గౌడ కు మరియు అతని ప్రియురాలు ముద్దుకుప్పాయికి జరిగే ప్రేమ కథ మనలను చదివింప చేస్తుంది.. అసలు ఈ పుస్తకము మొదట ప్రేమకథ ఇందులో యుద్ధం అనేది అంతర్లీనంగా ఉందా అని మనకు అనిపిస్తుంది..
అంతేకాకుండా ఆ కాలంలో ఉండే వేశ్యల జీవితాలను మరియు వారి దయనీయమైన పరిస్థితులను చూపెడుతుంది… యుద్ధానికి సైనికులే కాదు 20వేల మంది వేశ్యలు కూడా సైనికుల కోరికలు తీర్చడానికి వెళ్తారు అని మనకు తెలిసినప్పుడు ఆశ్చర్యం అవుతుంది…
యుద్ధం ప్రేమ కథ రెండు వైరుధ్యమైన అంశాలైనప్పటికీ రెండిటిని చక్కగా బ్యాలెన్స్ చేస్తూ కధను నడిపిస్తాడు… చారిత్రక నేపథ్యంతో ఉన్న ఈ నవల మనవలని చాలా బాగా రంజింప చేస్తూ చదివిస్తుంది…
మారుతి గారు నాకు ఈ నవలను ఇచ్చి చదవమన్నప్పుడు సమయం లేదు.. ఇప్పుడు తీరికగా ఉన్నా కాబట్టి చదివాను.. మనసులోని భావాలను మీతో పంచుకుంటున్నాను.. మీరు కూడా వీలైతే చదవండి చాలా బాగుంది..
డాక్టర్ చింతా ప్రభాకర్ రెడ్డి MS MCh
గుండె మరియు ఊపిరితిత్తుల శస్త్రచికిత్స నిపుణులు,
ప్రభుత్వ సర్వజన వైద్యశాల కర్నూలు