వాస్కోడగామా భారతదేశానికి సముద్ర మార్గం కనుగొన్న తర్వాత పోర్చుగీసు ప్రజలు, లిస్బన్ నగరవాసులు మనదేశం నుంచి సుగంధద్రవ్యాలు తీసుకొని వెళ్ళి యూరోప్ లో అమ్మి బాగా డబ్బు గడించే వారు. “తేజో తుంగ” నవల కథ పోర్చుగీసు రాజధాని లిస్బన్ లో, మనదేశంలోని విజయనగర సామ్రాజ్యంలోని తెంబకపురంలో జరుగుతుంది. రెండు ప్రేమకథలు సమాంతరంగా సాగుతాయి.

లిస్బన్లో గాబ్రియల్ అనే Christian యువకుడు ఇసబెల్లా అనే యూదు యువతిని ప్రేమిస్తాడు. ఆమె ధనవంతుని బిడ్డ, ఆతను పేద యువకుడు. తాను రెండేళ్లలో బాగా డబ్బు సంపాదించి తిరిగ వస్తానని ఆమెకు మాట ఇచ్చి మనదేశానికి వెళ్ళే నావలో ఒక వ్యాపార స్తుని వద్ద రొజూ లెక్కలు, నిత్యం జరిగే సంఘటనలు లిఖిత రూపంలో రాసిపెట్టడానికి బయలుదేరుతాడు. లిస్బన్.లో ప్లేగు వ్యాధితో జనం చనిపోతూన్న సమయంలో ఆతను బయలుదేరుతాడు. తను స్వతహాగా శిల్పి, చెక్కడంపనులు, శాసనాలు చెక్కడం వంటి పనులు చేస్తాడు. నావలో అతనికి జాకోం అనే వ్యక్తి మంచి మిత్రుడు అవుతాడు.

గేబ్రియల్ గోవాలో దిగి ఆల్బుకరో వద్ద లేఖన వృత్తిలో కుదురుతాడు.

విజయనగర సామ్రాజ్యంలో తెంబకపురంలో కేశవ ఓజ కులస్తుడు, శిల్పి, ద్వంద్వ యుద్దంలో గెలిచి హంపి- హంపంమ్మను దక్కించుకొంటాడు. రాయలకు పురుష సంతానం కలిగితే తను లెంక నవుతానని ప్రతిన పూనుతాడు. రాణి మగశిసువుకు జన్మనిస్తుంది. కేశవ బహిరంగ ప్రదేశంలో కత్తితో తన శిరసును ఖండించుకొని ప్రతిన నిలబెట్టుకొంటాడు. అతని వితంతువు హంపమ్మ ఆనాటి సంప్రదాయం ప్రకారం సహగమనం చేయవలసి వుంది. ఆమె గర్భవతి కుడా. గ్రామమంతా గుమిగూడి చుస్తూ వుండగా, ప్రాణంమీది ప్రేమతో హంపమ్మ సహగమనం చేయకుండా తప్పించుకొని పారిపోతుంది.

గేబ్రియల్ సుల్తానుల (ముస్లిమ్.ల) పాలనలో ప్రాణాలు కాపాడుకోడానికి బలవంతపు మతమార్పిడి అయి ముస్లిం మతం తీసుకొని అహమద్ ఖాన్ పేరుతో తిరుగుతూ, తర్వాత ముక్కూ, చెవులు కోయబడి అమ్మదకన్న అనే నామంతో పిలువబడుతూంటాడు.

నవల చివరకు రెండే పాత్రలు, అమ్మదకన్న, హంపమ్మ ఇద్దరే ఒకరికికొకరు మిగులుతారు, తేజో, తుంగ సంగమించినట్లు.

ఇసబెల్లా అగ్వేద చేతికి నాలుగు రంగుచేపపిల్లలను ఇచ్చి పంపుతుంది. చివరకు అవి తుంగభద్రలో వదిలిపెట్టబడతాయి. ఈ చేపల కథ ప్రతీకాత్మకంగా రచయిత ప్రవేశపెట్టాడు. గేబ్రియల్ చివర్లో హంపమ్మకు తోడూనీడ అవుతాడు. నవల పూర్తిచేసే సమయానికి జాతిమత భేదాలు, ప్రాంతీయ భేదాలు, అన్నీ కల్పితమని, మానవత్వమే మిన్న అనీ తోస్తుంది.

శ్రీ రంగనాథ రామచంద్రరావు చాలా సరళంగా తెలుగులోకి అనువదించారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Shopping Cart
Scroll to Top