ఈ రెండు సినిమాలు నేను పీకల్లోతు మిడిల్ ఈస్ట్ సినిమాతో ప్రేమలో పడిపోవడానికి కారణాలు. ఆ తర్వాత ఎన్నో గొప్ప మిడిల్ ఈస్ట్ సినిమాలు చూసాను.
అలా ఈ పుస్తకం చదివాక మరింతమంది స్త్రీల రచనలు చదవాలని నిర్ణయించుకున్నాను.
నాకెందుకో వాస్తవం నుంచి , మానవ నిజ జీవితం నుంచి పుట్టిన కథలు పుట్టించినంత గగుర్పాటు,ఆనందం, ఆశ్చర్యం, కల్పిత లోకాల కథలు పుట్టించవు. అందుకే స్టార్ వార్ లు, అవతార్ లు నాకు నిదర తెప్పిస్తాయ్. Amores perros, Departed లు కలలో కూడా వెంటాడతాయ్.
ఈ రచయిత్రి తన పాత్రల ద్వారా నా నిదుర చెదరగొట్టారు.
ఒక మగాడిగా నన్ను బోలెడంత ఆత్మ న్యూనత కి గురి చేశారు. కొన్ని కొత్త పాఠాలు నేర్పించారు.
ఆరు నెలల బిడ్డని abort చేయవలసి వచ్చిన తల్లి మనోవ్యధని వివరించారు, అలా ఓ ట్రిప్పు కష్మిర్ కి తీసుకెళ్లారు, మతాంతర వివాహం చేసుకున్న అమ్మాయి కేవలం తన పేరు కోసం చేసిన యుద్దాన్ని పరిచయం చేశారు.
ఇదంతా మళ్ళా అయిదారు కథల్లోనే.
జీవితంలోనూ కవిత్వంలోనూ economy of words and thoughts లేకపోవడం దేశభక్తికన్నా హీనమైన పాపం అంటాడు చలం .
చాలా తక్కువ మాటల్లో చాలా ఎక్కువ జీవితం చూపించిన మాధురి గారికి అభినందనలు. Please write more and enlighten us madam