₹220.00
ఈ పదహారు కథల్లో సగానికన్న ఎక్కువ గ్రామీణ జీవితం, వ్యవసాయం, రైతు జీవితం, వ్యవసాయ సంక్షోభం వంటి వస్తువులతో ఉండడం ఈ కథలకు, అసలు మొత్తం పుస్తకానికే మట్టి పరిమళాన్ని ఇస్తున్నది. ‘భూమికి పచ్చాని రంగేసినట్టు’ అని కవి రాశాడు గాని, నిజానికి భూమి పరుచుకున్న ఒక్క పచ్చదనంలోనే అనేకానేక ఛాయలుండడం మాత్రమే కాదు, పచ్చదనం మాత్రమే కాక అసంఖ్యాక రంగులకు కూడ భూమిక భూమి. కనుక భూమి గురించి రాయడమంటే సహజంగానే అనంత వైవిధ్యాన్ని పుణికి పుచ్చుకోవడమే. అలాగే ఇక్కడ అన్ని కథలూ, వాటిలోని పాత్రలు మనుషులు కాకపోయినప్పటికీ, ప్రకృతో, మానవేతర జీవులో అయినప్పటికీ, చెప్పదలచిందీ, చెప్పిందీ మానవ సంబంధాల అవ్యవస్థ గురించీ, ఆ అవ్యవస్థను మార్చవలసిన అవసరం గురించీ, ఆ అవసరం పట్ల పాఠకుల అవగాహన పెంచడం గురించీ. అందువల్ల, మట్టి సుగంధంలో భాగమైన మనిషితనం సుగంధం గురించి కూడ ఈ కథలు మాట్లాడుతాయి.
ఈ పదహారు కథల్లో సగానికన్న ఎక్కువ గ్రామీణ జీవితం, వ్యవసాయం, రైతు జీవితం, వ్యవసాయ సంక్షోభం వంటి వస్తువులతో ఉండడం ఈ కథలకు, అసలు మొత్తం పుస్తకానికే మట్టి పరిమళాన్ని ఇస్తున్నది. ‘భూమికి పచ్చాని రంగేసినట్టు’ అని కవి రాశాడు గాని, నిజానికి భూమి పరుచుకున్న ఒక్క పచ్చదనంలోనే అనేకానేక ఛాయలుండడం మాత్రమే కాదు, పచ్చదనం మాత్రమే కాక అసంఖ్యాక రంగులకు కూడ భూమిక భూమి.
Author –
Pages –