ఎన్నో రహస్యాలు ఛేదించబడ్డాయి

నా ప్రొఫైల్ పిక్ లో ఉన్న స్కర్ట్ వేసుకొని లాస్ట్ ఆదివారం బుక్ ఫెయిర్ కి వెళ్తే, కొంతమంది అదే పనిగా నన్ను ఎగాదిగా చూస్తూ కనిపించారు. నా skirtకి ఉన్న slitలో నుండి అడపాదడపా తొంగిచూస్తున్న నా మోకాలు & తొడ వాళ్ళని బాగానే disturb చేశాయని అర్ధమైంది. ఈలెక్క, నేను shorts వేసుకొని వస్తే వాళ్ళు అక్కడికక్కడే చస్తారేమోనని పక్కనే కూర్చున్న అరుణాంక్ తో అన్నాను. ఇంతలో ఇద్దరికీ కొన్ని డౌట్లనుమానంస్ వచ్చాయి – “వీళ్ళెవరూ ఇంతవరకూ అమ్మాయిల్ని చూడలేదా?! వీళ్ళందరూ చిమ్మ చీకట్లో వారి పెళ్ళాలతో కాపురం చేస్తున్నారేమో! ఈ ఆడ లేడీస్ కూడా వాళ్ల ఒళ్ళు వాళ్ళు చూసుకోరా…” వగైరా వగైరా.

సరిగ్గా అప్పుడే, తను నాతో, “దేవ రహస్యాలు వచ్చింది. చదువు. వీటి గురించే ఆ పుస్తకం. మీ అమ్మాయిలు ఒంటరిగా ఉన్నప్పుడు మాట్లాడుకునే విషయాల గురించి,” అన్నాడు. “ఈ మధ్య పుస్తకాలు చదవడం లేదు. అందులో translation works పెద్దగా ఇంట్రెస్ట్ లేద”న్నా. “తెలుగు పుస్తకమే. ఎండపల్లి భారతి రాసింది” అనగానే, పుస్తకం అందుకున్నా. “ముందు, back cover పై నా అభిప్రాయం చదువు. పుస్తకం చదివాక సమీక్ష రాయి,” అన్నాడు. ఇంతలో, మా మాటలు వింటున్న అప్పూ, “మొదటి రెండు కథలు చదివాను. పక్కన పడున్న రాళ్ళని తీసుకొని, డైనమైట్లుగా మార్చి మన మీదకి విసిరింది భారతి,” అంటూ తనకి వంత పాడింది. And thus, I took on the mission.

అయితే, ఇది సమీక్ష కాదు. ఈ “దేవ రహస్యాలు”, అరుదైన జ్ఞాపకాల రూపంలో నేను & నాలాగే ఇంకొంతమంది చెలికత్తెలు పోగుచేసుకున్న అమూల్యమైన జ్ఞాన సంపద. మగవాళ్ళకి & సమాజానికి “పొగరు”, “బరితెగింపు” & “బూతులు”గా వినబడే ఈ రహస్యాలు… నా చిన్నతనంలో, అంతుచిక్కని కొన్ని ప్రశ్నలుగానే మిగిలిపోయాయి. తర్వాతెప్పుడో వీటికి సమాధానాలు దొరకబట్టుకున్నానుకోండి. ఈ “దేహ” రహస్యాలను నా friendsతో, సందర్భం వచ్చినప్పుడు colleagues & cousins/relativesతో (అంతెందుకు, #facebook లో కూడా) షేర్ చేసుకున్నాను. Let me be brutally frank – Yes, these are “unfiltered talks” but defintely not women-only topics. ఇవి స్త్రీలకి మాత్రమే పరిమితం కావు. కాబడినవి. సభ్యత-సంస్కారం అనే ముసుగులో తమ శరీరాలను తాము తెలుసుకునే & అన్వేషించుకునే స్వేచ్ఛను హరించి మరీ పరిమితం చేయబడినవి.

అయితే, “గోప్యం”, “మర్మం”, “గుట్టు”, “దాపరికం”… లాంటి పేర్లతో మన శరీరాలకి సంబంధించిన మౌలిక జ్ఞానం నుండి ఇంకెంత దూరం పారిపోతారేహే అన్నట్టుగా… గూబ గుయ్యిమనేలా, చాచిపెట్టి కొట్టి మరీ వీటి అవసరాన్ని వివరించారు భారతి గారు – మొట్టికాయలకి జడిసి ఒకరి మాట వినే రోజులు ఎప్పుడో పోయాయి మరి! ఈ రహస్యాలు ఒక్కరి సొత్తులా మాత్రమే ఉండిపోకూడదు. అందరికీ తెలియాలి. అందరూ తెలుసుకోవాలి. అందుకు ఈ పుస్తకం మహ బాగా సహకరిస్తుంది. మీకు ఓపెన్ మైండ్ తో చదవాలి. అంతే!

ఈ పుస్తకంలో పరిచయమయ్యే ప్రతి స్త్రీ… తన ఒంటి వాసనలు, కణాలు, మచ్చల వెనుక కథలు & కష్టసుఖాలు మనతో పంచుకుంటుంది. ఇక్కడ మొగమాసిన ముద్దులు, మోహిని గాలులు, ఒంటి రంగులు-కొలమానాలు, జానపద వైద్యం-చిట్కాలు మాత్రమే కాదు, ఆస్తి (మానం/vulva), ప్యూబిక్ హెయిర్ (pubic hair/ఆతులు), భావప్రాప్తి (orgasm/జుమ్మ), రొమ్ముల బుడాలు, సనుబాలు (breastfeeding), ముట్లు (periods), తెల్లబట్ట (white discharge)… ఇలా ఎన్నో రహస్యాలు ఛేదించబడ్డాయి.
మన class, caste, upbringing, సభ్యత, పదాలు, ప్రాంతం లాంటి తొక్కలో ఫ్యాక్టర్స్ అన్నిటినీ ఎందులో ఒక అందులో తొక్కి, ఈ unfiltered women talk లో మునగండెహే. You won’t regret. I guarantee it.

ఈ కథల్లో, ప్రతి మనిషీ నేర్చుకోవాల్సిన అంశాలున్నాయి – మన శరీరశాస్త్రం (physiology), వ్యక్తిగత పరిశుభ్రత (personal hygiene), పునరుత్పత్తి ఆరోగ్యం (reproductive health), లైంగికంగా సంక్రమించే అంటువ్యాధులు (sexually transmitted infections), లైంగికత (sexuality), sexual fantasy, body autonomy, body positivity, body neutrality, & body liberation, నెలసరి (periods), గర్భధారణ (pregnancy), హార్మోన్ల అసమతుల్యత (hormonal imbalance), sex… ఇంకా ఎన్నెన్నో. ఒక్కముక్కలో చెప్పాలంటే, ఇదొక బుజ్జి encyclopedia on comprehensive sex education. అరుణాంక్ అన్నట్టు తెలుగు సాహిత్యంలో ఇదొక revolution!

భారతి గారు, మీ పుస్తకం చదివాక ఏం చెప్పాలో కూడా నాకు తెలియడం లేదు. పదాల కోసం ఇంకా వెతుకుతూనే ఉన్నాను. ఇంత రాసినా ఇంకా ఎంతో మిగిలిపోయిందనిపిస్తోంది. ఎప్పటిలాగే పుస్తకంలో కొన్ని సందర్భాలను, వాక్యాలను quote చేయొచ్చు. కానీ, చదవాలనుకునే వాళ్ళకి అవి spoilers అవుతాయని రాయడం లేదు. ఇవన్నీ కాదు కానీ, all I want to say is I love you… అంతే!

Last but not least, చాలామంది మగాళ్ళకు ఒక పెద్ద అపోహ ఉంది – “ఈ ఆడోళ్ళు కలిస్తే మా మగాళ్ల గురించే మాట్లాడుకుంటారు. మా మీద లేనిపోని చాడీలు చెప్పుకుంటుంటారు” అని. బొంగేమ్ కాదు. లైట్ తీసుకోండి. మా ఆడోళ్ళ ముచ్చట్లు ఇలాగే ఉంటాయి – పచ్చిగా. నిక్కచ్చిగా. దాపరికం లేకుండా. ఇల్లు, మగాడు & పిల్లలు మాత్రమే మా ప్రపంచం కాదు. మీరెవ్వరూ ఊహించనంత పెద్దది. అనంతమైనది. You’re definitely not the centre of our universe. మీకంత సీన్ లేదు. ఇవన్నీ వినడానికి & విన్నది అరిగించుకోడానికి మీకు దమ్ముందా? ఉంటే, ముందు ఈ పుస్తకం చదవండి. ఆ తర్వాత, మీ ఇంట్లో ఆడవాళ్ళ సమస్యలు, కోరికలు & చిన్న చిన్న ఆనందాల గురించి విచారించండి. వాళ్ళతో మాట్లాడండి. వాళ్ళని తెలుసుకోండి. అర్ధం చేసుకునే ప్రయత్నం చేయండి. ఈ క్రమంలో మీరేంటో మీకు కూడా అర్ధమవుతారు. All this is a never-ending journey. Just take the leap. ఇదంతా ఒక అంతులేని ప్రయాణం. నమ్మకంతో ముందడుగు వేయండబ్బా!

My heartiest congratulations to team Chaaya. Keep up your amazing work. భవిష్యత్తులో ఇలాంటి పుస్తకాలు మరెన్నో ప్రచురించాలని ఆశిస్తున్న.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Shopping Cart
Scroll to Top