ప్రత్యేకం ప్రతీ కథలో అపురూపమైన కధనం ఉంది

432 పేజీలున్న ఈ కథల పుస్తకంలో :12 కథలు ఉన్నాయి ., ఛాయా రిసోర్స్ సెంటర్ – హైదరాబాద్ వారి ప్రచురణ ఈ – నెమ్మి నీలం కథల పుస్తకం .,

ఇందులో ఉన్న కథలు అన్నీ కేవలం సరదా కోసమో / కాలక్షేపం కోసమో – చదవడానికి ఉపయోగపడవు .,

ప్రతీ కథలోనూ – అంతర్లీనంగా ఒక విభిన్నమైన ఆలోచన ,జీవితాన్ని దర్శించగలిగిన తత్త్వం .,భావోద్వేగాలను స్థిమితంగా చూడగలిగిన మేధస్సు .,

గాంధీజీ జీవన విధానాలను / పని పద్ధతులను ఆదర్శంగా తీసుకున్న విధానం .,తన భావాలను / ఆలోచనలను సాహిత్య రూపంలో అందించాలనే తపన ., ఈ కథల్లో మనం చూడవచ్చును

2015 లో భారత ప్రభుత్వం ఇచ్చిన – పద్మశ్రీ పురస్కారాన్ని వద్దనుకున్న నిజాయితీ – రచయితగా జయమోహన్ ఆలోచనలకు అద్దంపడుతుంది కదా !!

తెలుగులో ఈ కథలను అనువదించిన మిత్రులు అవినేని భాస్కర్ ఈ కథలకు ప్రాణం పోశారని నా నమ్మకం .,

మామూలుగానే కథలను విశ్లేషణ చేయడం / వివరించడం నాకు అలవాటు లేనిపని .,

ఎవరికి వాళ్ళు చదువుకోవాలి ఎవరికి వాళ్ళు విమర్శించుకోవాలి కదా !!!

నెమ్మి నీలం కథలు – ప్రత్యేకం ప్రతీ కథలో – అపురూపమైన కధనం ఉంది .,

Mohan Babu ( ఛాయా ప్రచురణలు )

జయమోహన్ గారికీ .,మిత్రులు అవినేని భాస్కర్ కు –

మనసారా అభినందనలు .,

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Shopping Cart
Scroll to Top