Chaaya Books

ప్రతి కథా చదువరుల్ని వెంటాడుతుంది

బ్రహ్మ పుస్తక సాహిత్య ఉత్సవంలో ప్రధాన ఆకర్షక (ఆకర్షణ కాదు ఆకర్షక సరైందని నా విద్యార్థి దశలో రాళ్ళపల్లి అనంత కృష్ణశర్మ గారు ఒక సభలో అనగా విన్నాను) వ్యక్తి. అంత వరకు అతని పేరు కూడా వినలేదు. రచనా తెలియదు. ఆ మూడు రోజులు నాలుగు రాష్ట్రాల రచయితలు, కళాకారులతో అద్భుతంగా సాగిన కాలం ఈ జయమోహన్ పేరుతో ఆగింది. ఛాయా పబ్లికేషన్స్ వారు నెమ్మి నీలం పేరుతో వేసిన పుస్తక ఆవిష్కరణ కిక్కిరిసిన శ్రోతల […]

ఇలా కూడా రాయొచ్చా?

ఇలా కూడా రాయొచ్చా ? అయితే నేను కూడా రాయొచ్చు ! అనిపించిందట కాఫ్కా రాసిన మెటామార్ఫసిస్ చదివాక మార్క్వేజ్ కి. అప్పటికి మార్క్వేజ్ రచయిత కాలేదు. దీన్నిబట్టి రచయిత కాదు అతని వర్క్ మాట్లాడాలి, పిచ్చెత్తించాలి, ఈడ్చుకుపోవాలి, అప్పటివరకు ఎరుగని లోవెలితిని చూపించి అశాంతితో మండించి బూడిద చెయ్యాలి. ఆ బూడిదలోంచి కొత్తజన్మ ఎత్తించాలి. ఇదంతా కళాకారుడు కాదు, అతని కళ చేయాలి. నిజానికి తాను జీవితంలో అనుభవించిన ఘోరమైన దశల్నే మండే అక్షరాలుగా మలచినవాడు […]

“ప్రణయ హంపి” ఓ యుద్ధరంగ ప్రేమ కావ్యం

ఒక యుద్ధం ఎన్నో జీవితాలను ప్రభావితం చేస్తుంది. ఆ ప్రభావంతో సైనికులు వారి కుటుంబాలే కాదు.. సామాన్య ప్రజల జీవితాలు కూడా అతలాకుతలం అవుతాయి. ప్రతి జీవితానికీ ఒక మానవీయ కథ ఉండి తీరుతుంది. మారుతి పౌరోహితం Maruthi Powrohitham విరచిత “ప్రణయ హంపి” కూడా యుద్ధం నేపథ్యంలో ఎన్నుకున్న ప్రేమ కథ. పూర్తిగా చదివాక, ఇది ప్రేమ కావ్యమా లేక యుద్ధ కావ్యమా అంటే చెప్పడం కష్టం. విజయనగర సామ్రాజ్య పతనానికి దారి తీసిన రక్కసి […]

చదవకపోతే చాలా మిస్ అవుతారు

” మీరు కార్ల్ సేగన్ రాసిన బ్రోకాస్ బ్రెయిన్ చదివారా?” ” లేదు” అన్నాను. ” భలే సమాధానం!” అన్నారు బయటనుండి అటువైపుగా వెళ్తున్న త్యాగేశ్వరన్ స్వామి. ” ఒక పుస్తకాన్ని ఓడించటానికి మహా గొప్ప మార్గం ఈ ఒక్క మాటే.అది పుంఖానుపుంఖాలుగా ఏం చెప్తే ఏంటి? ఈ ఒక్కమాటను వినగానే ఆశ్చర్యంతో నోరెళ్ళబెడతారు!” ‘ నెమ్మి నీలం’ పుస్తకం చదివారా? అంటే చాలామంది చెప్పే సమాధానం బహుశా అదే! ” చదవలేదు”! ప్రస్తుతం ఒక సినిమా […]

అనుభూతి, అనుభవం, ఆలోచన- నెమ్మినీలం

కొన్నిసార్లు కథ రాయటంకన్నా, చదవటమే భారంగా ఉంటుంది. అవును… కొన్ని కథలు జీవీతాల్లాగా ఉంటాయి. మరిచిపోయిన, కావాలనే మర్చిపోవాలనుకుంటున్న విషయాలని మళ్లీ గుర్తు చేస్తాయి. “నాగర్‌కోయిల్‌లో ఒక మంచి హత్య జరిగి చాలారోజులైంది” అని “తలఒగ్గనివాడు”తో టీకొట్టుదగ్గర మనిషి అన్నంత మామూలుగానే ఉంటుంది జీవితం కూడా. డబ్బున్నవాడికీ, లేనివాడికీ ఒకే కులంలో ఉన్నా అంతరం ఉంటుందనీ, ఇక కులం లేనివాడికి డబ్బున్నా పెద్ద తేడా ఉండదనీ తెలుస్తుంది. ఈ భారతీయ సమాజంలో పితృస్వామ్య భావజాలం మలమూత్రాలతో సంగీతాన్ని, […]

ఎందుకో బాగా ఇబ్బందికి, అసహనానికి గురి చేసింది నన్ను

నెమ్మినీలం కథల పుస్తకంలోని అమ్మవారి పాదం కథ. ఎందుకో బాగా ఇబ్బందికి, అసహనానికి గురి చేసింది నన్ను. ఆ తల్లి తరతరాల మౌనానికి, బరింపుకి ఆ పాదం నిదర్శనం. భూదేవంత ఓర్పు స్త్రీకి అనే సొల్లు మాటలు వెనకాల ఎంత వివక్ష ఉంది. గాలిలో నిలిపిన రెండో పాదాన్ని ఆమె దించితే? ఏమై ఉండేది.!? అలా నిలపటం ఆమె. అమ్మవారి పాదం ఒక మౌన వివక్ష. ఆరేళ్లకే అద్భుతమైన సంగీతాన్ని ఆలపించిన బామ్మ కావేరి నది లాంటిది. […]

వంద కమ్చీ దెబ్బల బాధ

‘నెమ్మి నీలం’ పుస్తకం లోని కధలు చదువుతున్నాను.ఏనుగు డాక్టర్ నాకు ఇష్టమైన కధ అనుకున్నాను.కానీ “వంద కుర్చీలు” కధ చదివాక ఆ అభిప్రాయం మారిపోయింది.వంద కుర్చీలు ఏమి కధ అది,జయమోహన్ ఆ కధని ఎలా రాయగలిగారు.నాయాడు కమ్యూనిటీ గురించి ఆయన ఎంత రిసెర్చ్ చేసి ఉండాలి.కధ చదువుతుంటే కడుపులో పేగులు లుంగచుట్టుకుపోతున్న బాధ,దుఖం.పేరు లేని ఆ తల్లి జీవితం,ఆ భయానకమైన జీవిత విధానం గుండెను పిండేస్తూంది.నాయాడు కమ్యూనిటి ప్రజలు ఎంత సామాజిక అణిచివేతకు గురై ఉంటే,ఎంత దుఖాన్ని […]

ప్రత్యేకం ప్రతీ కథలో అపురూపమైన కధనం ఉంది

432 పేజీలున్న ఈ కథల పుస్తకంలో :12 కథలు ఉన్నాయి ., ఛాయా రిసోర్స్ సెంటర్ – హైదరాబాద్ వారి ప్రచురణ ఈ – నెమ్మి నీలం కథల పుస్తకం ., ఇందులో ఉన్న కథలు అన్నీ కేవలం సరదా కోసమో / కాలక్షేపం కోసమో – చదవడానికి ఉపయోగపడవు ., ప్రతీ కథలోనూ – అంతర్లీనంగా ఒక విభిన్నమైన ఆలోచన ,జీవితాన్ని దర్శించగలిగిన తత్త్వం .,భావోద్వేగాలను స్థిమితంగా చూడగలిగిన మేధస్సు ., గాంధీజీ జీవన విధానాలను […]

చదివి నాలుగు రోజులు అవుతుంది. అయినా కథల్లో దృశ్యాలు కళ్ళముందు నుంచి పోవడం లేదు.

మొదటి కథ ధర్మం నుంచి చివరి కథ ఎల్లలోకములు ఒక్కటై దాకా అన్నీ దేనికవే ప్రత్యేకం. తమిళ సినిమా మీద ఉన్న అభిప్రాయమే తమిళ సాహిత్యం మీద కూడా ఉంది నాకు. అరవ అతి, నేను చిరాకు పడే ఒకానొక విషయం. అయితే, too much ఓవర్ యాక్షన్ చేస్తారు లేదా too much realistic చేస్తారు. Too much నాకెప్పుడూ నచ్చదు. కానీ ఈ కథలు నాకు too much గా నచ్చాయి. ధర్మం కథ […]

SUBSCRIBE

Chaaya - Subscription
Shopping cart close