Chaaya Books

“వంద కుర్చీలు” కథ నన్ను పట్టుకొని వదలడం లేదు

కరడుగట్టిన నిచ్చెనల కులవ్యవస్థ అతి నికృష్టమైన రూపాన్ని మనం దేవతల భూమి అయిన కేరళలోనే చూడగలమేమో! నాయాడి కులం “చూడరాని” కులం. నాయాడిని ఎవరైనా చూస్తేనే మైల పడతారు. అంతేకాదు.. చూడకపోయినా, సవర్ణుడికి దగ్గరలో 300 అడుగుల లోపల నాయాడి వున్నా మైల పడతారు. ఈ దూరం కులాన్ని బట్టి మారుతుంది. 300 అడుగుల కంటే లోపల నాయాడి వుంటే నంబూద్రి బ్రాహ్మణుడు మైల పడితే, 70 అడుగుల లోపలుంటే శూధ్రుడు మైల పడతాడు. ఈ చూడరాని, […]

ఆగి ఆగి చదువుతూ, కారుతున్న కన్నీళ్ళని ఆపుకుంటూ

నెమ్మి నీలం పూర్తిచేసాను. 430 పేజీలు చదవడానికి దాదాపు నెలరోజులు పట్టింది. గబగబా చదివేసి పక్కన పెట్టడానికి ఇదేం పల్ప్ ఫిక్షన్ కాదుగా! ఆగి ఆగి చదువుతూ, కారుతున్న కన్నీళ్ళని ఆపుకుంటూ, గడ్డకట్టిన దుఃఖంతో గొంతు నొప్పెడుతుంటే నేనెందుకు చదవాలీ పుస్తకాన్ని? చదివాను పో.. ఇంత బలహీనమైన గుండె నాకెందుకివ్వాలి? ఈ నెలరోజుల్లో ఈ పుస్తకాన్ని పక్కన పెట్టుకుని ఎన్ని రాత్రులు ఏడ్చి వుంటాను! మరోసారి “అమ్మవారి పాదం” కథ ఆడియో ఫైల్ వింటూ ” నాకు […]

గ్రామీణ సమాజం పట్ల ఆపేక్ష వున్న వారు, కార్మికుల పట్ల అనురక్తి వున్నవారుతప్పక చదవవలసిన పుస్తకం

 గ్రామీణ కార్మికులకు ఒక ఏడాదిలో 100 రోజులు పని కల్పించే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం మరియు ఇతర సంక్షేమ పధకాలు అమలౌవుతున్న తీరును క్షేత్రస్తాయిలో పరిశీలిస్తున్న పరిశోధకులలో బుద్ధ చక్రధర్ ఒకరు. ‘పరిశోధన’ అంటే అదేదో పి హెడి (Phd) కోసం చేసే పరిశోధన కాదు. పథకాల అమలులో వాటి విధి విధానాలు, ప్రభుత్వాలు ఏకపక్షంగా తెస్తున్న మార్పులు, చేర్పుల వలన లబ్దిదారులు ఎలా నష్టపోతున్నారో సాక్ష్యాధారాలతో ఎత్తిచూపించే పరిశోధన చక్రధర్ […]

అన్ని కథలూ దేనికవే ప్రత్యేకం. తప్పకుండా చదవాల్సిన పుస్తకం

ఫేస్బుక్ లో కొన్ని పోస్టులను చూసి, చాలా రోజులకు ఒక పుస్తకాన్ని చదవాలనే బలమైన కాంక్ష కలిగింది. అలా “నెమ్మి నీలం” చేతికి అందగానే 450 పేజీలను ఆపకుండా చదివేసాను. రచయిత స్వగతంతోనే ఉద్వేగం మొదలయింది. అవినీతి పైన ఉద్యమం ద్వారా మార్పు వస్తుంది అనే ఆయన కల నెరవేరక పోతే ఆయనలో ఒక స్తబ్ధత ఏర్పడింది. ఆ స్తబ్ధత తొలగించుకోవటానికి చేసిన అన్వేషణలో, నేడున్న పరిస్థితుల్లో ఆచరణాత్మక ఆదర్శ వాదానికి గాంధీయ సిద్ధాంతం తప్ప మార్గాంతరం […]

ప్రతి కథా చదువరుల్ని వెంటాడుతుంది

బ్రహ్మ పుస్తక సాహిత్య ఉత్సవంలో ప్రధాన ఆకర్షక (ఆకర్షణ కాదు ఆకర్షక సరైందని నా విద్యార్థి దశలో రాళ్ళపల్లి అనంత కృష్ణశర్మ గారు ఒక సభలో అనగా విన్నాను) వ్యక్తి. అంత వరకు అతని పేరు కూడా వినలేదు. రచనా తెలియదు. ఆ మూడు రోజులు నాలుగు రాష్ట్రాల రచయితలు, కళాకారులతో అద్భుతంగా సాగిన కాలం ఈ జయమోహన్ పేరుతో ఆగింది. ఛాయా పబ్లికేషన్స్ వారు నెమ్మి నీలం పేరుతో వేసిన పుస్తక ఆవిష్కరణ కిక్కిరిసిన శ్రోతల […]

ఇలా కూడా రాయొచ్చా?

ఇలా కూడా రాయొచ్చా ? అయితే నేను కూడా రాయొచ్చు ! అనిపించిందట కాఫ్కా రాసిన మెటామార్ఫసిస్ చదివాక మార్క్వేజ్ కి. అప్పటికి మార్క్వేజ్ రచయిత కాలేదు. దీన్నిబట్టి రచయిత కాదు అతని వర్క్ మాట్లాడాలి, పిచ్చెత్తించాలి, ఈడ్చుకుపోవాలి, అప్పటివరకు ఎరుగని లోవెలితిని చూపించి అశాంతితో మండించి బూడిద చెయ్యాలి. ఆ బూడిదలోంచి కొత్తజన్మ ఎత్తించాలి. ఇదంతా కళాకారుడు కాదు, అతని కళ చేయాలి. నిజానికి తాను జీవితంలో అనుభవించిన ఘోరమైన దశల్నే మండే అక్షరాలుగా మలచినవాడు […]

“ప్రణయ హంపి” ఓ యుద్ధరంగ ప్రేమ కావ్యం

ఒక యుద్ధం ఎన్నో జీవితాలను ప్రభావితం చేస్తుంది. ఆ ప్రభావంతో సైనికులు వారి కుటుంబాలే కాదు.. సామాన్య ప్రజల జీవితాలు కూడా అతలాకుతలం అవుతాయి. ప్రతి జీవితానికీ ఒక మానవీయ కథ ఉండి తీరుతుంది. మారుతి పౌరోహితం Maruthi Powrohitham విరచిత “ప్రణయ హంపి” కూడా యుద్ధం నేపథ్యంలో ఎన్నుకున్న ప్రేమ కథ. పూర్తిగా చదివాక, ఇది ప్రేమ కావ్యమా లేక యుద్ధ కావ్యమా అంటే చెప్పడం కష్టం. విజయనగర సామ్రాజ్య పతనానికి దారి తీసిన రక్కసి […]

చదవకపోతే చాలా మిస్ అవుతారు

” మీరు కార్ల్ సేగన్ రాసిన బ్రోకాస్ బ్రెయిన్ చదివారా?” ” లేదు” అన్నాను. ” భలే సమాధానం!” అన్నారు బయటనుండి అటువైపుగా వెళ్తున్న త్యాగేశ్వరన్ స్వామి. ” ఒక పుస్తకాన్ని ఓడించటానికి మహా గొప్ప మార్గం ఈ ఒక్క మాటే.అది పుంఖానుపుంఖాలుగా ఏం చెప్తే ఏంటి? ఈ ఒక్కమాటను వినగానే ఆశ్చర్యంతో నోరెళ్ళబెడతారు!” ‘ నెమ్మి నీలం’ పుస్తకం చదివారా? అంటే చాలామంది చెప్పే సమాధానం బహుశా అదే! ” చదవలేదు”! ప్రస్తుతం ఒక సినిమా […]

అనుభూతి, అనుభవం, ఆలోచన- నెమ్మినీలం

కొన్నిసార్లు కథ రాయటంకన్నా, చదవటమే భారంగా ఉంటుంది. అవును… కొన్ని కథలు జీవీతాల్లాగా ఉంటాయి. మరిచిపోయిన, కావాలనే మర్చిపోవాలనుకుంటున్న విషయాలని మళ్లీ గుర్తు చేస్తాయి. “నాగర్‌కోయిల్‌లో ఒక మంచి హత్య జరిగి చాలారోజులైంది” అని “తలఒగ్గనివాడు”తో టీకొట్టుదగ్గర మనిషి అన్నంత మామూలుగానే ఉంటుంది జీవితం కూడా. డబ్బున్నవాడికీ, లేనివాడికీ ఒకే కులంలో ఉన్నా అంతరం ఉంటుందనీ, ఇక కులం లేనివాడికి డబ్బున్నా పెద్ద తేడా ఉండదనీ తెలుస్తుంది. ఈ భారతీయ సమాజంలో పితృస్వామ్య భావజాలం మలమూత్రాలతో సంగీతాన్ని, […]

ఎందుకో బాగా ఇబ్బందికి, అసహనానికి గురి చేసింది నన్ను

నెమ్మినీలం కథల పుస్తకంలోని అమ్మవారి పాదం కథ. ఎందుకో బాగా ఇబ్బందికి, అసహనానికి గురి చేసింది నన్ను. ఆ తల్లి తరతరాల మౌనానికి, బరింపుకి ఆ పాదం నిదర్శనం. భూదేవంత ఓర్పు స్త్రీకి అనే సొల్లు మాటలు వెనకాల ఎంత వివక్ష ఉంది. గాలిలో నిలిపిన రెండో పాదాన్ని ఆమె దించితే? ఏమై ఉండేది.!? అలా నిలపటం ఆమె. అమ్మవారి పాదం ఒక మౌన వివక్ష. ఆరేళ్లకే అద్భుతమైన సంగీతాన్ని ఆలపించిన బామ్మ కావేరి నది లాంటిది. […]

SUBSCRIBE

Chaaya - Subscription
Shopping cart close