ఈ మధ్య కాలంలో నేను చదివిన మంచి పుస్తకాల్లో ఇది ఒకటి.
అత్యద్భతమైన కథ అని చెప్పను కాని , మనం వినని కథల్లో ఇదొకటి. సమస్యలు ఎప్పుడు ఎలా వస్తాయో, అసలు ఇటువంటి సమస్యలు కూడా ఉంటాయా అనే విధంగా చిన్నదైన చక్కటి అంశాలతో మొత్తం నవల సాగుతుంది.
కథ గురించి ఇంకా ఎక్కువ చెప్బితే అందులో అందం పోతుంది. సాధారణమైన కథే అయినా కొన్ని చోట్ల ఆధ్యాత్మికంగా , కొన్ని చోట్ల ఆలోచించే విధంగా , అసలు వయసుతో సంబంధం లేకుండా వచ్చే సమస్యలు ఎలా ఉంటాయో చూపించిన నవల ఇది.
ముఖ్యంగా 50-60 వయస్సు గల వారందరూ తప్పక చదవాల్సిన పుస్తకం. అలా అని యువతరం చదవకూడదని కాదు. అందరూ చదవచ్చు ముఖ్యంగా పెద్దలు చదవాల్సిందే.
కుటుంబ సమస్యలు , భార్య భర్తల సంబంధం , కార్పొరేట్ ఆఫీస్ రాజకీయాలు , వ్యాపారంలో ఉండే సమస్యలు , పిల్లల పెంపకం , పెద్దలపై పిల్లల ఆలోచనలు .. ఇలా అన్నిటినీ స్పృశించి దత్తాత్రి గారు చక్కగా రాసారు.
ఇక అనువాదం చేసిన రంగనాథ గారి గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఎక్కడా అనువాదం చదువుతున్నామని అనిపించనంతగా ఉంది.
గొప్ప పుస్తకాల స్థాయిలో ఉందో లేదో చెప్పలేను కాని, కచ్చితంగా చదివిన వారిని ఒకసారి ఆలోచించేలా చేస్తుంది ఈ పుస్తకం.
పుస్తకం మొత్తంలో నాకు బాగా నచ్చిన విషయాల్లో శివస్వామీ , థక్కర్ చేసిన ధర్మస్థల యాత్ర.
కొన్ని నిర్ణయాలు కొన్ని ప్రయాణాల తర్వాత తీసుకుంటాం. అందుకు లాజిక్కులు ఉండవు. మనలోనే ఆ మార్పు వచ్చేస్తుంది , ఆ ప్రయాణంలోని విశేషం అదే.
అందుకే వాళ్ళ దర్మస్థల యాత్ర నాకు బాగా నచ్చింది