ఊహకందని విచిత్రమైన మలుపు తేజో – తుంగభద్ర
మిత్రమా వసుధేంద్రా! Vasudhendra నిద్రపోతూ ఉండి ఉంటావు కదా ఈ సమయానికి. ఎట్లా? ఈ దిగులు కుండను నా నెత్తి మీద మోపి నువ్వీ రాత్రివేళ నిద్రపోగలుగుతున్నావు. బెల్లా చేతినుంచి గాబ్రియేల్ దగ్గరికి అక్కడినుంచి అగ్వేద దగ్గరికీ ఆమె చేతిమీదుగా తుంగబద్రా నదిలోకి జారిన బంగారు చేపపిల్లనై అటు లిస్బన్ కీ ఇటు హంపీకి మధ్య… గోవాలో తెగిపడిన గాబ్రియేల్ శిశ్నపు పూర్వచర్మపు ముక్కనై రోదిస్తున్నాను నాయనా. ఎక్కడ మొదలైందో ఈ కథ…. కథలా అనిపించే వికృత […]