యుద్ధం – ప్రేమ రెండిటినిచక్కగా బ్యాలెన్స్ చేసిన కథ

మారుతి పౌరోహితం గారు రచించిన ఈ చారిత్రక కాల్పినక నవల మనలను విజయనగర సామ్రాజ్యంలో జరిగిన రాక్షస తంగడి యుద్ధం కాలానికి తీసుకెళ్తుంది.. శ్రీకృష్ణదేవరాయలు చనిపోయిన తర్వాత ఆయన అల్లుడు అళియరామరాయుల కాలంలో జరిగే ఓ యుద్ధం మరియు ఓ ప్రేమ కథ ఇందులో మిళితమై ఉన్నాయి.. చరిత్రలో నిలిచిపోయిన రాక్షస తంగడి యుద్ధం హంపి విధ్వంసం గురించి మనకు వాటి గురించి తెలుసుకోవాలని ఉత్సుకత ఉంటుంది.. ఆ యుద్ధం వివరాలను ఆ యుధ్ధం జరిగే తీరును […]
“ప్రణయ హంపి” ఓ యుద్ధరంగ ప్రేమ కావ్యం

ఒక యుద్ధం ఎన్నో జీవితాలను ప్రభావితం చేస్తుంది. ఆ ప్రభావంతో సైనికులు వారి కుటుంబాలే కాదు.. సామాన్య ప్రజల జీవితాలు కూడా అతలాకుతలం అవుతాయి. ప్రతి జీవితానికీ ఒక మానవీయ కథ ఉండి తీరుతుంది. మారుతి పౌరోహితం Maruthi Powrohitham విరచిత “ప్రణయ హంపి” కూడా యుద్ధం నేపథ్యంలో ఎన్నుకున్న ప్రేమ కథ. పూర్తిగా చదివాక, ఇది ప్రేమ కావ్యమా లేక యుద్ధ కావ్యమా అంటే చెప్పడం కష్టం. విజయనగర సామ్రాజ్య పతనానికి దారి తీసిన రక్కసి […]
హంపీ నడిపిన ప్రేమకథ

ఏ యుద్ధమైనా ప్రజలకు మాత్రమే నష్టం చేస్తుంది. అధికార కాంక్ష పెరిగిన తర్వాత రాజ్యాల కన్ను సుభిక్షంగా ఉండే ప్రాంతాల మీద పడింది. అక్కడినుంచే కుటిల తంత్రాలు మొదలయ్యాయి. దేశం ఎలా ఉన్నా , ఎన్ని కరువులు సంభవించినా కానీ రాజ్యాలు తమ సైన్యాన్ని పెంచి పోషించే నిల్వలు మాత్రం గట్టిగానే పొగుచేసుకున్నాయి.ప్రపంచ చరిత్ర నిండా ఎన్నో మరకలున్నాయి, వెన్నుపోట్లు, వక్రీకరణలు ఇలా రాసుకుంటూ పోతే అంతం లేకుండా సాగుతూనే ఉంటుంది. కూలిన కోట గోడల వెనక […]
చారిత్రిక నవలలు రాయటం అంత సులువుకాదు

యుద్దమంటే మానవత్వంపై దాడి, హక్కుల హననం. అటువంటి ఒక బీభత్స, విషాద నేపథ్యంలో మనుషుల మధ్య, ముఖ్యంగా యువతీ యువకుల మధ్య ప్రేమలు తొడగడం ఆశ్చర్యం గొలుపుతుంది. ఒక కొత్త ఆశనూ చిగురింపజేస్తుంది. కులాలకు, జాతులకు, దేశాలకు అతీతంగా పాదుకునే ఈ ప్రేమలు మనుషుల హృదయ సత్ శీలతకు నిదర్శనం. యుద్ధంలో కూరుకుపోయి రాజ్యం కూలిపోతున్నప్పుడు, విలువలు పతనమై దేశం కునారిల్లుతున్నప్పుడు, మనుగడే ప్రశ్నార్ధకమైనప్పుడు యువతీయువకులే దాని ప్రక్షాళనకు నడుంబిగిస్తారు. న్యాయం పక్షాన నిలబడతారు. బయటికి కనిపించకుండా […]