హంపీ నడిపిన ప్రేమకథ

ఏ యుద్ధమైనా ప్రజలకు మాత్రమే నష్టం చేస్తుంది. అధికార కాంక్ష పెరిగిన తర్వాత రాజ్యాల కన్ను సుభిక్షంగా ఉండే ప్రాంతాల మీద పడింది. అక్కడినుంచే కుటిల తంత్రాలు మొదలయ్యాయి. దేశం ఎలా ఉన్నా , ఎన్ని కరువులు సంభవించినా కానీ రాజ్యాలు తమ సైన్యాన్ని పెంచి పోషించే నిల్వలు మాత్రం గట్టిగానే పొగుచేసుకున్నాయి.ప్రపంచ చరిత్ర నిండా ఎన్నో మరకలున్నాయి, వెన్నుపోట్లు, వక్రీకరణలు ఇలా రాసుకుంటూ పోతే అంతం లేకుండా సాగుతూనే ఉంటుంది. కూలిన కోట గోడల వెనక […]

చారిత్రిక నవలలు రాయటం అంత సులువుకాదు

యుద్దమంటే మానవత్వంపై దాడి, హక్కుల హననం. అటువంటి ఒక బీభత్స, విషాద నేపథ్యంలో మనుషుల మధ్య, ముఖ్యంగా యువతీ యువకుల మధ్య ప్రేమలు తొడగడం ఆశ్చర్యం గొలుపుతుంది. ఒక కొత్త ఆశనూ చిగురింపజేస్తుంది. కులాలకు, జాతులకు, దేశాలకు అతీతంగా పాదుకునే ఈ ప్రేమలు మనుషుల హృదయ సత్ శీలతకు నిదర్శనం. యుద్ధంలో కూరుకుపోయి రాజ్యం కూలిపోతున్నప్పుడు, విలువలు పతనమై దేశం కునారిల్లుతున్నప్పుడు, మనుగడే ప్రశ్నార్ధకమైనప్పుడు యువతీయువకులే దాని ప్రక్షాళనకు నడుంబిగిస్తారు. న్యాయం పక్షాన నిలబడతారు. బయటికి కనిపించకుండా […]

పతంజ‌లిశాస్త్రి క‌థ‌లు.. వేరే లోకం

పతంజలి శాస్త్రి కథలంటే ఇష్టం. ఎందుకంటే తెలియదు, అది అంతే. ఆయనకి అవార్డు వచ్చినప్పుడు రాద్దామనుకున్నా. రాయలేదు. అవార్డు ఆయనకి మించింది కాదు. జ్ఞానపీఠమైనా తక్కువే. మన కాలం మహారచయిత. ఈ మధ్య నేను తెల్లారి లేస్తున్నా. బూడిద రాలుతున్న ఆకాశంలో నుంచి బంగారుపల్లెంలా సూర్యున్ని చూస్తున్నా. ఏళ్ల తరబడి జర్నలిస్టు నైట్ డ్యూటీల్లో కోల్పోయిన సౌందర్యం. నిద్రలేని రాత్రుల నుంచి, నిద్రపట్టని రాత్రుళ్ల ఫేజ్లోకి ప్రవేశించా. అందుకే అకాల మెలకువ.రాయడంలో పతంజలిశాస్త్రి ఎలా పిసినారో, ఆయన […]

మరో కోణం పరిచయం చేసే నవల

2018 లో అనుకుంటా. ఆఫీస్ అయిపొయ్యేసరికి రాత్రి 9.30 దాటింది. పార్కింగ్ లోనుంచి బయటికి రాగానే వర్షం తగ్గిన తర్వాతొచ్చే చల్లగాలి వణికించింది. మళ్లీ వర్షం వచ్చేలోపు క్రిష్ణానగర్ చేరుకోవాలని శిల్పారామం మీదుగా 100 ఫీట్ రోడ్డెక్కింది నా అపాచీ బైక్. ట్రాఫిక్ తక్కువుండటంతో బైకు వేగం పెరిగేకొద్దీ వెంట్రుకలు నిక్కబొడుచుకుంటున్నాయి. మాధాపూర్ వైయస్సార్ విగ్రహం దగ్గర లిఫ్ట్ కావాలంటూ ఎవరో చెయ్యెత్తారు. చూస్తూనే చెప్పొచ్చు ఎవరో లేబర్ పని చేసుకునే అతను అని. ఆ రూట్ […]

50-60 వయస్సు గల వారందరూ తప్పక చదవాల్సిన పుస్తకం

ఈ మధ్య కాలంలో నేను చదివిన మంచి పుస్తకాల్లో ఇది ఒకటి. అత్యద్భతమైన కథ అని చెప్పను కాని , మనం వినని కథల్లో ఇదొకటి. సమస్యలు ఎప్పుడు ఎలా వస్తాయో, అసలు ఇటువంటి సమస్యలు కూడా ఉంటాయా అనే విధంగా చిన్నదైన చక్కటి అంశాలతో మొత్తం నవల సాగుతుంది. కథ గురించి ఇంకా ఎక్కువ చెప్బితే అందులో అందం పోతుంది. సాధారణమైన కథే అయినా కొన్ని చోట్ల ఆధ్యాత్మికంగా , కొన్ని చోట్ల ఆలోచించే విధంగా , […]

మట్టి వాసనల పుస్తకం

చక్కగా ప్రతి పేజీలో మట్టి వాసన వచ్చేలా పుస్తకం రాసుకుంటే ముందు మాట రాసిన వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మార్మికత అంట గట్టేసి ఒక్కొక్క డొంక దారిలోకి తీసుకెళ్ళి వదిలేశారు. #లంకమల దారుల్లో మట్టి వాసనకి (మార్మిక భాషలో ఎదురవుతున్న) అధి భౌతికతకు మధ్యన ఉన్నది రెండు ధ్రువాల మధ్యన ఉన్న అంతరం అని ఎవరన్నారో తెలియదు. HD Thoreau అన్నవాడు Ralph Waldo Emerson, Walt Whitman అమెరికన్ transcendentalist వరసలో వచ్చిన మనిషి. ఆయన […]

మీకు థ్రిల్లర్లంటే ఇష్టమైతేహాయిగా కొని చదివెయ్యండి

ఫిబ్రవరి 21, రాత్రి 8.05 నిమిషాలు, ప్రదేశం తాడేపల్లిగూడెం మినీ బైపాస్ మీద ఆగిన ఎక్స్‌ప్రెస్ బస్సులో మొదటి సీటు. ఐదు నిమిషాలు టిక్కెట్టు కొని చిల్లర పుచ్చుకోవడానికి, మూడు నిమిషాలు సామాన్లు సర్దుకోవడానికి, ఏడు నిమిషాలు చట్నీ నంచుకుంటూ మూడున్నర ఇడ్లీలు (సగం కింద పడిపోవడం వల్ల) తినడానికి ఖర్చయిపోయాయి, వాట్సాప్‌ మేసేజ్‌లకు జవాబులివ్వడానికి, ఫోన్లు చేయడానికి మరో ఐదు నిమిషాలు. దానితో సమయం 8.25 నిమిషాలు కావచ్చింది. అప్పుడు, బ్యాగులోంచి సూదంటురాయిలా లాగే రంగులు, […]

ఆ అడవిదారుల, గిరిజన జీవులమధ్యా తిరుగుతున్నట్టు మనసు నిండిపోయింది

యాత్రికుడు అనే మాట వినగానే చిన్నప్పుడు చదివిన యూఅన్‌ఛాంగ్ లాంటి రూపం ఒకటి కదిలేది. ఆ తర్వాత అది రకరకాల మార్పులు చెందుతూఒకసారి పరవస్తు లోకేశ్వర్ లాగా, మరోసారి దాసరి అమరేంద్రలాగా లేదంటే మరొకలాగా … ఎన్నో రూపాలు మారుతూ ఓ నాలుగేళ్లకిందట మాచవరపు ఆదినారాయణ గారి రూపం తీసుకుంది. ఇప్పటికీ యాత్రికుడు అనగానే ఆదినారాయణ గారి రూపమూ, “తిరిగే తుమ్మెదకే తేనె దొరుకుతుందీ అనే వాక్యమూ గుర్తొస్తాయి.” (ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ ఒక్కోసారి గుర్తొచ్చినా […]