చదవకపోతే చాలా మిస్ అవుతారు

” మీరు కార్ల్ సేగన్ రాసిన బ్రోకాస్ బ్రెయిన్ చదివారా?” ” లేదు” అన్నాను. ” భలే సమాధానం!” అన్నారు బయటనుండి అటువైపుగా వెళ్తున్న త్యాగేశ్వరన్ స్వామి. ” ఒక పుస్తకాన్ని ఓడించటానికి మహా గొప్ప మార్గం ఈ ఒక్క మాటే.అది పుంఖానుపుంఖాలుగా ఏం చెప్తే ఏంటి? ఈ ఒక్కమాటను వినగానే ఆశ్చర్యంతో నోరెళ్ళబెడతారు!” ‘ నెమ్మి నీలం’ పుస్తకం చదివారా? అంటే చాలామంది చెప్పే సమాధానం బహుశా అదే! ” చదవలేదు”! ప్రస్తుతం ఒక సినిమా […]

అనుభూతి, అనుభవం, ఆలోచన- నెమ్మినీలం

కొన్నిసార్లు కథ రాయటంకన్నా, చదవటమే భారంగా ఉంటుంది. అవును… కొన్ని కథలు జీవీతాల్లాగా ఉంటాయి. మరిచిపోయిన, కావాలనే మర్చిపోవాలనుకుంటున్న విషయాలని మళ్లీ గుర్తు చేస్తాయి. “నాగర్‌కోయిల్‌లో ఒక మంచి హత్య జరిగి చాలారోజులైంది” అని “తలఒగ్గనివాడు”తో టీకొట్టుదగ్గర మనిషి అన్నంత మామూలుగానే ఉంటుంది జీవితం కూడా. డబ్బున్నవాడికీ, లేనివాడికీ ఒకే కులంలో ఉన్నా అంతరం ఉంటుందనీ, ఇక కులం లేనివాడికి డబ్బున్నా పెద్ద తేడా ఉండదనీ తెలుస్తుంది. ఈ భారతీయ సమాజంలో పితృస్వామ్య భావజాలం మలమూత్రాలతో సంగీతాన్ని, […]

ఎందుకో బాగా ఇబ్బందికి, అసహనానికి గురి చేసింది నన్ను

నెమ్మినీలం కథల పుస్తకంలోని అమ్మవారి పాదం కథ. ఎందుకో బాగా ఇబ్బందికి, అసహనానికి గురి చేసింది నన్ను. ఆ తల్లి తరతరాల మౌనానికి, బరింపుకి ఆ పాదం నిదర్శనం. భూదేవంత ఓర్పు స్త్రీకి అనే సొల్లు మాటలు వెనకాల ఎంత వివక్ష ఉంది. గాలిలో నిలిపిన రెండో పాదాన్ని ఆమె దించితే? ఏమై ఉండేది.!? అలా నిలపటం ఆమె. అమ్మవారి పాదం ఒక మౌన వివక్ష. ఆరేళ్లకే అద్భుతమైన సంగీతాన్ని ఆలపించిన బామ్మ కావేరి నది లాంటిది. […]

వంద కమ్చీ దెబ్బల బాధ

‘నెమ్మి నీలం’ పుస్తకం లోని కధలు చదువుతున్నాను.ఏనుగు డాక్టర్ నాకు ఇష్టమైన కధ అనుకున్నాను.కానీ “వంద కుర్చీలు” కధ చదివాక ఆ అభిప్రాయం మారిపోయింది.వంద కుర్చీలు ఏమి కధ అది,జయమోహన్ ఆ కధని ఎలా రాయగలిగారు.నాయాడు కమ్యూనిటీ గురించి ఆయన ఎంత రిసెర్చ్ చేసి ఉండాలి.కధ చదువుతుంటే కడుపులో పేగులు లుంగచుట్టుకుపోతున్న బాధ,దుఖం.పేరు లేని ఆ తల్లి జీవితం,ఆ భయానకమైన జీవిత విధానం గుండెను పిండేస్తూంది.నాయాడు కమ్యూనిటి ప్రజలు ఎంత సామాజిక అణిచివేతకు గురై ఉంటే,ఎంత దుఖాన్ని […]

ప్రత్యేకం ప్రతీ కథలో అపురూపమైన కధనం ఉంది

432 పేజీలున్న ఈ కథల పుస్తకంలో :12 కథలు ఉన్నాయి ., ఛాయా రిసోర్స్ సెంటర్ – హైదరాబాద్ వారి ప్రచురణ ఈ – నెమ్మి నీలం కథల పుస్తకం ., ఇందులో ఉన్న కథలు అన్నీ కేవలం సరదా కోసమో / కాలక్షేపం కోసమో – చదవడానికి ఉపయోగపడవు ., ప్రతీ కథలోనూ – అంతర్లీనంగా ఒక విభిన్నమైన ఆలోచన ,జీవితాన్ని దర్శించగలిగిన తత్త్వం .,భావోద్వేగాలను స్థిమితంగా చూడగలిగిన మేధస్సు ., గాంధీజీ జీవన విధానాలను […]

చదివి నాలుగు రోజులు అవుతుంది. అయినా కథల్లో దృశ్యాలు కళ్ళముందు నుంచి పోవడం లేదు.

మొదటి కథ ధర్మం నుంచి చివరి కథ ఎల్లలోకములు ఒక్కటై దాకా అన్నీ దేనికవే ప్రత్యేకం. తమిళ సినిమా మీద ఉన్న అభిప్రాయమే తమిళ సాహిత్యం మీద కూడా ఉంది నాకు. అరవ అతి, నేను చిరాకు పడే ఒకానొక విషయం. అయితే, too much ఓవర్ యాక్షన్ చేస్తారు లేదా too much realistic చేస్తారు. Too much నాకెప్పుడూ నచ్చదు. కానీ ఈ కథలు నాకు too much గా నచ్చాయి. ధర్మం కథ […]

మన హృదయాలకు‘నెమ్మి నీలం’ అద్దుకుందాం!

మిళ రచయిత జయమోహన్ (జెయమోహన్ అనాలా?) పన్నెండు కథల సంపుటం ‘నెమ్మి నీలం’ చదవడం ఒక అపురూపమైన, ఉత్తేజకరమైన, ఆలోచనాస్ఫోరకమైన, ఏకకాలంలో విషాద బీభత్స హాస్య కరుణా స్పందనలు కలిగించగల అద్భుత అనుభవం. ఆ పఠన అనుభవం నుంచి, ఆ అనుభవం తర్వాత చెలరేగే ఆలోచనల సుడిగుండాల నుంచి తప్పించుకోవడం చాలా కష్టం. ఆ కథాస్థలాల నుంచి, ఆ సన్నివేశాల నుంచి, ఆ పాత్రల నుంచి, ఆ సంభాషణల నుంచి, వాటి ప్రభావం నుంచి బైటపడడం చాల […]

‘నెమ్మి నీలం’ పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న వివేక్ శానభాగ

వేదికపై వసుధేంద్ర, మృణాళిని, పుస్తక రచయిత జయమోహన్, అనువాదకుడు అవినేని భాస్కర్, ఛాయ ఎడిటర్ అరుణాంక్ లత బుక్ బ్రహ్మ సాహిత్య ఉత్సవ్ తెలుగు సాహిత్య సౌరభం వెల్లివిరిసింది. మూడురోజులపాటు సాగిన ఉత్సవంలో వందలాదిమంది తెలుగు రచయితలు, సాహితీ అభిలాషులు పాల్గొన్నారు. ఐదు వేదికల ద్వారా 50కి పైగా చర్చాగోష్టులు, పుస్తకావిష్కరణలు నిర్వహించారు. పలు సమీక్షల్లో ‘ఆంధ్రజ్యోతి’ ఎడిటర్ కె.శ్రీని వాస్ భాగస్వాములయ్యారు. తెలుగుతోపాటు కన్నడ, తమిళం, మళయాళ భాషల ప్రముఖ రచయితలు పాల్గొన్నారు. చివరిరోజు ఆదివారం […]

Nemmi Neelam Book Launch || Video

నేను తెలుగు పాఠకుల్ని కోరేది ఒక్కటే. ఒక పుస్తకాన్ని మీకోసం, మరొక పుస్తకాన్ని మీ స్నేహితుల కోసం కొనండి. – వివేక్ శానభాగ నేనొక్కటే చెబుతాను. మీరీ పుస్తకాన్ని చదవకపోయినట్లైతే, చాలా మిస్ అవుతారు. ఈ పుస్తకాన్ని కొనండి. వెంటనే చదవండి. – వసుధేంద్ర

వాస్కోడగామా భారతదేశానికి సముద్ర మార్గం కనుగొన్న తర్వాత పోర్చుగీసు ప్రజలు, లిస్బన్ నగరవాసులు మనదేశం నుంచి సుగంధద్రవ్యాలు తీసుకొని వెళ్ళి యూరోప్ లో అమ్మి బాగా డబ్బు గడించే వారు. “తేజో తుంగ” నవల కథ పోర్చుగీసు రాజధాని లిస్బన్ లో, మనదేశంలోని విజయనగర సామ్రాజ్యంలోని తెంబకపురంలో జరుగుతుంది. రెండు ప్రేమకథలు సమాంతరంగా సాగుతాయి. లిస్బన్లో గాబ్రియల్ అనే Christian యువకుడు ఇసబెల్లా అనే యూదు యువతిని ప్రేమిస్తాడు. ఆమె ధనవంతుని బిడ్డ, ఆతను పేద యువకుడు. […]