Description
ఈ కథలన్నీ దాదాపు ప్రేమకథలే. ఇంకా చెప్పాలంటే… విడిపోయిన, ఒంటరిగా మిగిలిపోయిన వ్యక్తుల ప్రేమకథలు. ఏ బరువులూ మోయని ఒక కాలపు వ్యక్తి సంఘర్షణలతో పెనుగులాడే కథలు. ఇందులో ప్రధాన వ్యక్తులందరూ ఏదో ఒక కళకు జీవితాన్ని కట్టేసుకున్న వాళ్ళే.
ఈ కథల్లో కేవలం కథా, దాని నిర్మాణం చూస్తే ఒకేతీరుగా రాయబడిన కథలు అని మీరు పెదవి విరచవచ్చు. కానీ అందులోని గత ప్రేమకథలు కలిగిన యువకులు ముఖ్యం. నూతనంగా విజృంభిస్తున్న పెట్టుబడీదారీ విధాన నగరంలోని స్వేచ్ఛను, ప్రేమను కోరుకునే కళాత్మక జీవుల గోస ఈ కథల నిండా వినిపిస్తుంది.
వందేళ్లనాడు యూరప్లోని యువకులను ఇందులోని వ్యక్తులు మనల్ని గుర్తుకుతెస్తారు. వీళ్ళు ఒక చోట ఇరికే మనుషులు ఏ మాత్రం కాదు. సంక్షోభ సమయంలో ప్రేమను కోల్పోయిన ఒంటరి వ్యక్తులు. ఈ కథల్లోని వ్యక్తుల ఒంటరితనం గురించి వాళ్ళ జీవితం గురించి మనం ఆలోచించకపోతే మన దేశపు యువకుల నిస్సహాయ, ఆర్థికరాహిత్య, కృత్రిమ జీవితాల వ్యతిరేకతను మనం అంచనా కట్టలేం.
Reviews
There are no reviews yet.