₹300.00 Original price was: ₹300.00.₹270.00Current price is: ₹270.00.
తల్లికోట యుద్ధంలో అలియ రామరాయులును చంపేసిన తర్వాత అపారమైనటువంటి సంపద కలిగిన విజయనగర సామ్రాజ్యం ఆ సంపదనంతా తీసుకొని పెనుగొండ వైపు ప్రయాణం అయింది. అయితే ఆ సంపద పెనుగొండ చేరిందని పెనుగొండ చేరలేదని తిరుపతి వైపు పోయిందని అనేక చారిత్రక వాదనలు ఉన్నాయి. డాక్టర్ కె.ఎన్. గణేషయ్యకు విజయనగర సామ్రాజ్య చరిత్ర పట్ల ఆసక్తితో 1550 ఏనుగుల మీద తరలి వెళ్ళిన సంపద ఏమైంది అని వెతికిన వెతుకులాటే ఈ “ఏనుగెక్కిన సంపద”. ఈ నవలలో ప్రతి అధ్యాయమూ ప్రతి పుటా అత్యంత ఆసక్తికరంగా రాయడంలో రచయిత విజయం సాధించాడు. చదవడం మొదలు పెడితే పూర్తయింతవరకు ఏకబిగిన చదివించే బిగువు ఈ నవలకు ఉన్నది. ‘కరి సిరి యాన’గా కన్నడలో వచ్చిన నవలకు ఇది తెలుగు అనువాదం. రంగనాథ రామచంద్రరావు అనువాదకుడు.