₹150.00 Original price was: ₹150.00.₹135.00Current price is: ₹135.00.
కంభంజ్ఞాన సత్యమూర్తి అంటే ఎక్కువ మందికి తెలియకపోవచ్చు. శివసాగర్ తెలియని వాళ్ళు అరుదు. విప్లవ రాజకీయాలు మొదలు దళిత అస్తిత్వ ఉద్యమాల దాక తన ప్రయాణం జరిగింది. శివసాగర్ కవిత్వం లాగే ఆయన జీవితమూ, ఆచరణ సంచలనం. సాయుధ విప్లవ పోరాటం నుండి బహిష్కరింపబడిన తర్వాత ‘శివసాగర్ లేడు. ఉన్నది సత్యమూర్తీ’ అనే వాదన చేశారు కొందరు. ‘విరసం మరణించింది అని చెప్పిన శివసాగరే మరణించాడు’ అని అన్నారు. ‘కులం చర్చ లేవదీసినందుకే శివసాగర్ ను వెలి వేశారు’ అని దళిత ఉద్యమం అన్నది. ‘ఆయన పార్టీలో లేవదీసిన చర్చలో కులం, అంబేడ్కర్, అంబేడ్కరిజం లేదు. ఆయన పెట్టిన డాక్యుమెంట్స్ వీగిపోయాక పార్టీని చీల్చే ప్రయత్నం చేసినందుకే’ అని విప్లవోద్యమంతో దగ్గరగా ఉన్నవాళ్ళు, ఆ సమయంలో అజ్ఞాతంలో ఉన్నవాళ్ళు రాశారు.
ఏది ఎలా ఉన్నా సత్యమూర్తి లేకుండా శివసాగర్ లేడు. శివసాగర్ నుండి సత్యమూర్తిని వేరుచేయలేం. ఆయన జీవితం, రాజకీయ ఆచరణతో పాటే ఆయన కవిత్వం నడిచింది. ఆయన కవిత్వాన్ని రాజకీయాలను రాజకీయాలను ఆయనలోని భావుకతను వేరుచేయలేం. శివసాగర్ విప్లవోద్యమం నుండి బయటకు వచ్చి మూడు దశాబ్దాలు. ఆయన భౌతికంగా మరణించి ఈ ఏప్రిల్ కి ఒక దశాబ్దం.
శివసాగర్ తెలియని వాళ్ళు అరుదు. విప్లవ రాజకీయాలు మొదలు దళిత అస్తిత్వ ఉద్యమాల దాక తన ప్రయాణం జరిగింది. శివసాగర్ కవిత్వం లాగే ఆయన జీవితమూ, ఆచరణ సంచలనం. సాయుధ విప్లవ పోరాటం నుండి బహిష్కరింపబడిన తర్వాత ‘శివసాగర్ లేడు.
Author –
Pages –