Description
జీవితం కొందరికి వడ్డించిన విస్తరి అయితే కొంతమందికి వారి విస్తరి వారే తయారు చేసుకోవాల్సిన పరిస్థితి. జీవితంలో యెన్నో ఆటుపోట్లకు గురై చివరకు అందరూ అసూయపడేంత ఉన్నత స్థాయికి చేరుకుటారు. అయితేనేం సామాన్యులకు తేలిగ్గా దొరికే సుఖ శాంతులూ, భద్రతా వారికి అందని మానిపండ్లే! అలా తారాజువ్వల్లా నింగి కెగసి, ఉల్కల్లా నేలకు జారిపోయిన కొందరి ప్రముఖుల జీవితాలే ఈ ‘అలా కొందరు’ పుస్తకం. ఇందులో కొకైన్ కింగ్ పాబ్లో ఎస్కోబార్, శృంగారతార మార్లిన్ మన్రో, విషాద తారలు మీనా కుమారి, పర్వీన్ బాబీ, గురుదత్, మొదలైన వారి నుండీ మరపురాని రచయితలు ‘శారద’ (నటరాజన్), ‘చక్రపాణి’ వరకూ కొంతమంది జీవిత కథలున్నాయి. ఇలా వడ్డించిన విస్తరి మీ కోసమే, మీదే ఆలస్యం!
Reviews
There are no reviews yet.