పిల్లల పెంపకంలో వారికి నేర్పించాల్సిన అంశాలు యెన్నో, అలాంటి అంశాలపై వొక కథా సంకలనం తీసుకురావాలనిపించింది. పిల్లల సేఫ్టీ అనగానే మనందరికీ లైంగిక వేధింపుల నుంచి రక్షణే స్ఫురిస్తుంది. పిల్లలకు లైంగిక వేధింపుల నుంచి రక్షణ ఖచ్చితంగా కావాలి. గుడ్ టచ్ – బాడ్ టచ్ని పిల్లలకి చెప్పాలనే యెరుక మనందరికీ వుంది. అయితే పెరుగుతున్న పిల్లలకు నేర్పించాల్సిన స్కిల్స్ యింకా చాలా వున్నాయి. వాటిని మనం పిల్లలకి యెలా చెపుతాం? ఆత్మ విశ్వాసం, ధైర్యం, సెల్ఫ్ డిఫెన్స్ యిలాంటి విషయాలని పిల్లలతో యెలా మాట్లాడతాం? లైంగిక వేధింపుల నుంచి మాత్రమే కాక పిల్లలకు యింకా యే రకంగా రక్షణ అవసరం? యీ కోణంలో వొక సంకలనాన్ని తీసుకుని రావాలని రచయితలని కథలు రాయమని అడిగాము. వుత్సాహంగా స్పందించి తమ తమ కథలని యీ ‘గులాబీపూల బాట’ సంకలనంకి అందించిన ప్రతి వొక్కరికీ హృదయ పూర్వక కృతజ్ఞతలు. మా యీ ప్రయత్నం పాఠకులకు స్ఫూర్తిని యిస్తుందని ఆశిస్తున్నాము. అందరికీ హృదయ పూర్వక కృతజ్ఞతలు. శుభాకాంక్షలు.
మీ కుప్పిలి పద్మ అనంత్ మరింగంటి
Reviews
There are no reviews yet.