ఊహకందని విచిత్రమైన మలుపు తేజో – తుంగభద్ర

మిత్రమా వసుధేంద్రా! Vasudhendra నిద్రపోతూ ఉండి ఉంటావు కదా ఈ సమయానికి. ఎట్లా? ఈ దిగులు కుండను నా నెత్తి మీద మోపి నువ్వీ రాత్రివేళ నిద్రపోగలుగుతున్నావు. బెల్లా చేతినుంచి గాబ్రియేల్ దగ్గరికి అక్కడినుంచి అగ్వేద దగ్గరికీ ఆమె చేతిమీదుగా తుంగబద్రా నదిలోకి జారిన బంగారు చేపపిల్లనై అటు లిస్బన్ కీ ఇటు హంపీకి మధ్య… గోవాలో తెగిపడిన గాబ్రియేల్ శిశ్నపు పూర్వచర్మపు ముక్కనై రోదిస్తున్నాను నాయనా. ఎక్కడ మొదలైందో ఈ కథ…. కథలా అనిపించే వికృత […]

తన దృక్పథం నుంచి తన జీవితం

[శ్రీ చందకచర్ల రమేశ బాబు అనువదించిన ‘నేను.. కస్తూర్‌బా ని’ అనే పుస్తకాన్ని సమీక్షిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.] సాధారణంగా, తమ తమ రంగాలలో విజయం సాధించిన పురుషుల విషయంలో – వారికి వెన్నుదన్నుగా నిలిచిన స్త్రీల గురించి బయటి ప్రపంచానికి తెలిసేది చాలా తక్కువ. ఒకవేళ తెలిసినా అది సంక్షిప్తంగానే ఉంటుంది తప్ప సమగ్రంగా ఉండదు. అసలు ఎవరైనా ఏదైనా సాధించాలంటే, వారి కృషితో పాటుగా, వెనుక ఉండి మద్దతిచ్చే వారి తోడ్పాటూ కీలకం. బహుశా […]

చదువుతుండగా రెండుమూడు సార్లు కన్నీరొలికింది

సన్ ఆఫ్ జోజప్ప: నవలిక: సోలోమోన్ విజయ కుమార్ : ఛాయ ప్రచురణ: సెప్టెంబరు 6, 2018న దేశ అత్యున్నత న్యాయస్థానం తన తీర్పులో భారతీయ శిక్షా స్మృతిలో సెక్షన్ 377 రాజ్యాంగ విరుద్ధమన్నది, న్యాయ చరిత్రలో ఒక మైలురాయి. సమలైంగితను ఇష్టపడే వారు స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్న రోజు. ఏ నేరం చేయకపోయినా సమలైంగికతను కోరుకునే వారు సమాజంలో ఇక నేరస్థులు కారని చెప్పిన రోజు. సమలైంగిక సంబంధాల వలన పునరుత్పత్తి జరుగదు కనుక అది […]

పదాల మధ్య పెద్ద ఊహనిండుకొని ఉంటుంది.

కథలు, నవలలు రాసినంత మాత్రాన్నే ఒకరిని సృజనాత్మక రచయిత అనలేను. ఆ రచయిత రాతలోని పదాల మధ్య ఉన్న ఊహ ద్వారా మాత్రమే వారిని సృజనాత్మక రచయిత అనగలను. కేవలం పదాలు పదాలుగానే మిగిలిపోతే అంతకన్నా పేలవమైన రచన మరొకటి ఉండదని నేను తలుస్తాను. పతంజలి గారి కథలు చదివినప్పుడు ఆయన రాతలోని పదాల మధ్య పెద్ద ఊహ నిండుకొని ఉంటుంది. ఆయన రాసిన ఒక కథ చదివి పుస్తకం మూసేసి, ఇంకో కథను రాయగలిగినంత ఊహను […]

ప్రతి కథా ఒక ప్రశ్న…ఒక డిస్కషన్…. ఒక మెలకువ.

పతంజలి శాస్త్రి గారు ఒక లిటరరీ అడ్డిక్షన్. పోలిక సరికాదేమో గానీ, రేపు రిలీజయ్యే సినిమా కోసం ఇవ్వాళ సెకండ్ షో అయిపోయాక, టికెట్ల క్యూ లో నిద్రోయే లాంటి అడిక్షన్. కొత్త కథల పుస్తకం వస్తుందనగానే ఆత్రుత అందునా ఇంతవరకూ ఎక్కడా ప్రచురితం కాని కథలు…దాంతో మరింత హైప్. ఉత్సుకత. శాస్త్రి గారు ఎప్పటిలానే పాఠకుణ్ణి ఎలాంటి నిరాశకీ గురి చేయలేదు. గురి తప్పనూ లేదు. కాస్త స్ట్రాంగ్ గా కూడా ఉంది.ప్రతి కథా ఒక […]

“రచయిత ఎంత దాక్కోవాలని చూసినా పదాల మధ్య తన గొంతు ఆ రచయితను పట్టిస్తుంది”.

ఒక వ్యక్తి జీవితంలో జరిగిన సంఘటన ఆధారంగా, జీవితం ఆధారంగా ఒక నవల రాయవచ్చు. వాటిని చారిత్రిక నవలలు లేదా జీవిత చరిత్ర నవలలు అనవచ్చు. గురజాడ జీవితంలోని ఒక ముఖ్య సంఘటన ఆధారంగా ఆయన సాహిత్యాన్ని, జీవితాన్ని చెప్పబడిన నవలగా ఈ పుస్తకాన్ని ఎంచవచ్చు. ఈ రచన చారిత్రిక, పరిశోధనాత్మక నవల కన్నా ఒక తరం నుంచి మరో తరం చెప్పుకుంటూ వచ్చిన కథ ఆధారంగా అల్లబడినది నవల. ఈ పుస్తకం మొదట ప్రారంభించినప్పుడు ఒక […]

భిన్న పాత్రల్ని మన ముందుంచుతుంది ఈ నవల

అనేక నదులు ప్రవహించి సముద్రాన్ని చేరతాయి. సముద్రాన్ని చేరే చోటు దూరం నుంచి చూస్తే శాంతంగా, మనోహరంగా కనిపించినా, ఆ సంగమం మధ్యకెళ్లి చూసినప్పుడే నది సాగరాన్ని చేరేప్పటి కోలాహలం కనిపిస్తుంది. ఈ కథ జరిగే ఉత్తర కన్నడ కడలితీరంలోని ఈ ప్రజల జీవితాల్లోకి వెళ్తేనే వాళ్ళ కథ కూడా మనకు అలానే అనిపిస్తుంది. సాధారణంగా మనకి మనుషులపై మొదట్లో కలిగిన అభిప్రాయాలను మార్చుకోము, ఎందుకంటే ఆ అవకాశాలు మనకు చాలా అరుదుగా ఉంటాయి. మంచి అభిప్రాయాలు […]

మనసున గుబాళించే అత్తరు లాంటి కథలే

తెలుగు భాషలో రచనలే కాక ఇతర భారతీయ భాషల నుంచి తెలుగులోకి మంచి అనువాద రచనలు తరచు ప్రచురిస్తున్న ప్రచురణ సంస్థ ఛాయ ప్రచురణలు. ఇందులో ఆరు కథలు కథా సంపుటి శీర్షికలా చదివాక మనసున గుబాళించే అత్తరు లాంటి కథలే. మొదటి కథ అత్తరు నిజానికి అత్తరులా గుబాళించే ఓ ప్రేమలేఖ కథ. ప్రేమ కథలుంటాయిగానీ ఎవరు ఎవరికో రాసుకున్న ప్రేమలేఖకు కూడా ఇంత హృద్యమైన కథ ఉంటుందా? అని అడిగితే ఈ కథ చదివాక […]

తేజో, తుంగభద్ర రెండూ రక్తాశ్రుధారలే…

గతమంతా తడిసె రక్తమున,కాకుంటే కన్నీళులతో…’గతం మాత్రమే కాదు, వర్తమానం కూడా అదే రక్తంలో, కన్నీళ్లలో తడుస్తున్నప్పుడు, మునిగిపోతున్నప్పుడు గత వర్తమానాల మధ్య ఎడతెగని సంభాషణ అయిన చరిత్రకు అర్థం ఏమిటి? చారిత్రక నవల రూపంతో వచ్చిన కళారూపపు వాస్తవ సారం రక్తాశ్రు రసాయనం కాదా? వసుధేంద్ర కొత్త నవల తేజో తుంగభద్ర రక్తాశ్రు రసాయనం రంగరించిన అద్భుతమైన కళారూపం. ఈ నవలకు చరిత్ర ఒక సాకు మాత్రమే. రచయిత కాలూనడానికి, పాత్రలకు స్థలకాలాల నేపథ్యం ఇవ్వడానికి ఒకానొక […]

Historical Fiction ఇష్టపడే వాళ్ళు తప్పకుండా చదవాల్సిన పుస్తకం

మనిషి అభివృద్ధి చెందుతున్నాడు. రోజురోజుకీ ఎన్నో కొత్త విషయాలను తెలుసుకుంటున్నాడు. కొత్తవి సృష్టిస్తున్నాడు. మరి మనిషి తన గురించి తాను తెలుసుకున్నాడా..!? శారీరికంగా,మేధోపరంగా కాకుండా మానసికంగా పరిణితి చెందేడా !?.. ఇలాంటి ప్రశ్నలకు సమాధానం చరిత్ర మాత్రమే చెప్తుంది. ఐతే దేశ చరిత్ర తెలుసుకోవడం వల్ల కేవలం అప్పటి రాజకీయ పరిస్థితులు, సాంఘిక ఆచారాలు తెలుస్తాయి కానీ అప్పటి మానసిక స్థితి తెలిసే అవకాశం చాలా తక్కువ ఉంది. అలా తెలుసుకోవాలి అంటే కేవలం ఒక్క ప్రాంతం […]