కాలానికి అవసరమైన కథలు
కొన్ని చీకట్లూ… ఓ వెలుతురూ… పేరు తగినట్లే వెలుగూ చీకట్ల కథలివి. చీకటిని చీల్చి ప్రభాతం వెలుగొందుతుందని చెప్పిన కథలివి. ప్రగతి మహిళగానూ, ఉపాధ్యాయురాలిగానూ తన చుట్టూ చూసిన మనుషుల్ని కథలు చేసింది. పిల్లలు బడికి రావడం లేదని ఒక్కోసారి తీసుకునే అడ్మినిస్ట్రేటివ్ నిర్ణయం వలన ‘తిరుపాలమ్మ’ లాంటి విద్యార్థుల జీవితాలు ఏ మలుపు తీసుకుంటాయో! ఆ నిర్ణయం తీసుకునే పొజిషన్లో ఉండేవారే చెప్పగలరు. “రైటింగ్ కౌచ్” రచనారంగంలో ఉన్నవారూ, కొత్తగా రాస్తున్నవారు తప్పక చదవాల్సిన కథ. […]